Lady Finger Benefits: ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారం మార్పులు రావటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అటువంటి సమస్యలలో రక్తహీనత సమస్య కూడా ఒకటి. శరీర ఆరోగ్యానికి అవసరమైన పౌష్టికాహారం తీసుకోకపోవటం వల్ల శరీరంలో పోషకాలు కొరత ఏర్పడి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల కారణంగా శరీరంలో రక్తహీనత సమస్య కూడా మొదలవుతుంది. అయితే ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసి మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా ప్రతి రోజు ఒక గ్లాస్ బెండకాయ నానబెట్టిన నీటిని తాగాలి.
బెండకాయలో కూడా మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు దాగి ఉంటాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో బెండకాయలు చిదిమి వాటిని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగాలి. రోజు ఇలా ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త హీనత సమస్త తగ్గుతుంది. బెండకాయ నీటిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగితే రక్త హీనత సమస్య కూడ తగ్గుతుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ బెండకాయ నీటిని తాగడంమంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నీటిని తాగడం వల్ల రక్తహీనత సమస్య మాత్రమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారించవచ్చు.అధిక బరువు సమస్యతో బాధపడేవారు వారి సమస్యలను నియంత్రించడానికి ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో బెండకాయలు తీసుకోవటం వల్ల వాటిలో ఉండే ఫైబర్ కారణంగా ఎక్కువ సమయం ఆకలి వేయదు. అందువల్ల శరీర బరువు కూడ తగ్గుతుంది . బెండకాయలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల ప్రతి రోజూ వీటిని ఆహారంలో తీసుకుంటే కంటిచూపు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World