Finger Millet: ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్ల లో మార్పులు రావటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.అందరినీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్యలు స్థూలకాయం సమస్య కూడా ఒకటి. అధిక బరువు (స్థూలకాయం) సమస్య వల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతూ అధిక బరువు తగ్గటానికి అవసరమైన అనేక రకాల పద్ధతులను పాటిస్తున్నారు. చాలామంది డైటింగ్ చేయటం వ్యాయామాలు చేయటం వంటివి చేస్తూ తమ బరువును తగ్గించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామాలు మాత్రమే కాకుండా మనం తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేయడం వల్ల అధిక బరువు సమస్యను నియంత్రణలో ఉంచవచ్చు.
అధిక బరువు సమస్యతో బాధపడేవారికి రాగులు వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. రాగులు అధిక బరువును తగ్గించడమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ వారు తీసుకునే ఆహారంలో చేర్చడం వల్ల ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రాగులలో ఫైబర్ ఐరన్ మెగ్నీషియం వంటి పోషక విలువలు ఉంటాయి.షుగర్ వ్యాధితో బాధపడే వారికి కూడా ప్రతిరోజు వారు తీసుకొనే ఆహారంలో రాగులు చేర్చుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. రాగులలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల అధిక బరువు సమస్యతో బాధపడేవారు రాగులు తినడం వల్ల సమస్యను నియంత్రించవచ్చు.
రాగులలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రాగులతో చేసిన ఆహార పదార్థాలను తిన్నప్పుడు పొట్ట నిండుగా ఉండి ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. అందువల్ల అధిక బరువు ఉన్నవారు ప్రతి రోజూ వారు తీసుకొనే ఆహారంలో ఒక పూట రాగులతో చేసిన ఆహార పదార్థాలను తినటం వల్ల సులభంగా వారి బరువును తగ్గించవచ్చు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World