Thalambralu Chettu: ప్రకృతిలో పెరిగే ప్రతి చెట్టు ప్రతి ఒక్క మానవ జీవనానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల మొక్కలు చెట్లు మానవుని ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో ఉపయోగపడతాయి. మొక్కలు మనుషులకు అవసరమైన ప్రాణవాయువును అందించడమే కాకుండా అనేక రోగాలను నయం చేయటానికి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ప్రకృతిలో పొలాల గట్ల మీద విచ్చలవిడిగా పెరిగే ఒక మొక్క ఆకులు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో అద్భుతంగా పని చేస్తాయి . పిచ్చి మొక్కగా భావించే తలంబ్రాల చెట్టు ఆకుల ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పంట పొలాల్లో పొదలు పొదలుగా పెరిగే ఈ తలంబ్రాల చెట్టు ఆకులను కీళ్ల నొప్పుల నివారణలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారు కూడా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు ఉన్నవారు వేల రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడే బదులు ఈ తలంబ్రాల చెట్టు ఆకులు ఒకసారి ఉపయోగిస్తే మంచి ఫలితం లభిస్తుంది.
తలంబ్రాల చెట్టు ఆకులు, కొంచెం ఆముదం కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ప్రతి రోజూ రాత్రి నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ ను పూసి ఒక గుడ్డతో గట్టిగా కట్టుకోవాలి. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఇలా చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. కీళ్ల నొప్పులకు మాత్రమే కాకుండా వెన్ను నొప్పి, నడుము నొప్పి, కండరాల నొప్పుల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.
ఈ తలంబ్రాల చెట్టు ఆకులు గజ్జి, తామర ఇతర చర్మ సంబంధిత వ్యాధులు నయం చేయడంలో కూడా మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఏమైనా గాయాలు తగిలినప్పుడు ఆ ప్రదేశంలో ఈ ఆకులను మెత్తగా రుబ్బి కట్టు కట్టడం వల్ల గాయం తొందరగా మారిపోతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతాయి. ముఖ్యంగా పూర్వం గ్రామాలలో ఈ ఆకులను పాము కాటు చికిత్సలో ఉపయోగించేవారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World