marriage : మన తాతలు, నాన్నల కాలంలో పెళ్లిళ్లు అనగానే ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ కనిపిస్తుంది. సరాసరి 5 నుంచి 12 ఏళ్ల వయస్సు తేడాతో వివాహాలు జరిగేవి. అప్పట్లో అమ్మాయిలు పెద్దమనిషి కాగానే పెళ్లిళ్లు చేసేవారు. అంతేకాకుండా వయస్సు మధ్య తేడాలను అస్సలు పట్టించుకునే వారు కాదని తెలిసింది. అబ్బాయి మంచోడా కాదా.. బాగా సంపాదిస్తున్నాడా.. ఆస్తి పాస్తులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారట.. ఇక ఒకరికొకరు నచ్చడం అనే కాన్సెంప్ట్ ఆ రోజుల్లో పెద్దగా ఉండేవి కావనుకో.. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ విషయాన్ని పేరెంట్స్ కచ్చితంగా ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు సరిగా కాకపోవడమే మెయిర్ రీజన్ అని తెలుస్తోంది.
కొందరికి తన కంటే ఏజ్‌లో పెద్దవారిని చేసుకున్నామని ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వారు జాబ్ లొకేషన్ లేదా బయట తన ఏజ్ వారితో ఎక్కువగా స్నేహం చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే వదిలేసుకోవాలి. ఏజ్ విషయాన్ని పదే పదే ఆమె/అతడు గుర్తుచేయరాదు. బెడ్ రూం విషయాల్లో ఓపెన్‌గా ఉండాలి. మీ భాగస్వామికి ఏదైనా తెలియపోతే చెప్పే ప్రయత్నం చేయండి.. చిన్న చూపు చూడొద్దు..కించపరిచే మాటలు అనొద్దు.. ఇద్దరి మధ్య షేరింగ్ తప్పనిసరి. లేనియెడల ఇద్దరి మధ్యలో గొడవలు, మనస్పర్దలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీంతో దాంపత్య జీవితం నరకంగా మారుతుంది.
Read Also : Marriage Relationship : ఫస్ట్ నైట్ ఆ కార్యం చేసేటప్పుడు.. మగవారు తెగ ఆలోచిస్తారట.. ఎందుకో తెలుసా..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world