...

Muskmelon : వేసవి కాలంలో కర్భుజాలే కాదండోయ్ తర్భుజాలు తినాల్సిందే.. ఎందుకంటే!

Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మంది కర్భుజా, తాటి ముంజలు, కొబ్బరి బోండాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. అలాగే శరీరాన్ని చల్లబరుచుకునేందుకు అనేక రకాల పండ్ల రసాలు తాగుతారు. మరికొంత మంది కూల్ డ్రింక్స్ తాగుతూ భానుడి భగభగ నుంచి ఉపశమనం పొందుతారు. అయితే వేసవిలో వీటినే కాకుండా తర్భుజాలను కూడా తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తర్భుజా వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయని చెబుతున్నారు. అయితే ఆ లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Muskmelon
Muskmelon

తర్భుజాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల హైబీపీ త్గగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రక్తం పలుచుగా మారుతుంది. తర్భుజాలో విటామిన్ ఎ కూడూ అధికంగానే ఉంటుంది. దీన్ని తినడం వల్ల కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అలాగే కళ్లల్లో శుక్లాలు రాకుండా ఉంటాయి. కిడ్నీల్లో స్టోన్స్ సమస్య ఉన్నవారు తర్భుజాలు తినడం వల్ల రాళ్లు కరిగిపోతాయి. అలాగే కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడకుండా ఉంటాయి. కొంత మంది మహిళలకు నెలసరి సమయంలో అనేక రకాల నొప్పులు కల్గుతుంటాయి.

అలాగే అధికంగా రక్త స్రావం అవుతుంటుంది. వీటిని తగ్గించుకోవాలంటే కచ్చితంగా తర్భుజాలను తినాల్సిందేనట. అలాగే తర్భుజాల్లో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. గ్యాస్, మల బద్ధకం, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ సీజన్ లో జీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. వీటిని తినడం వల్ల ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే తర్భుజాలు చప్పగా ఉండటం వల్ల చాలా మంది ఇష్టపడరు. కానీ వీటని ముక్కలుగా కట్ చేసి.. కాస్త ఉప్పు లేదా తేనె, మిరియాల పొడి వంటివి చల్లుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.

Read Also : Migraine Headache : మైగ్రేన్ తలనొప్పితో సతమతమవుతున్నారా… ఈ నూనెతో ఉపశమనం పొందండి?