Iron Rich Foods : హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడం అనేది చాలా మందిలో ఎక్కువగా కనిపించే సమస్య ఇది ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మనం రోజూ తినే ఆహార పదార్థాలలో కొన్నింటిని చేర్చడం ద్వారా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం.

తోటకూర (Amaranth Leaves) :
తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. తోటకూర తినడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో సోడియం పొటాషియం తో పాటు విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక తోటకూర గుండ్ల సమస్యలను దూరం చేయడంలో కూడా ఎంతగానో తోడ్పడుతుంది. ఇది శరీరంలోని అధిక కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. తోటకూర లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. హైపర్ టెన్షన్ తో బాధపడేవారు తోటకూర ను తీసుకోవడం వల్ల చాలా మంచి లాభాలు కలుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు.

తోటకూర లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇక అంతే కాకుండా ఎర్రరక్తకణాల సంఖ్య ను కూడా పెంచుతుంది. మనం రోజూ తినే ఆహారంలో తోటకూరను చేర్చడం ద్వారా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు.
ఎండు ద్రాక్ష (Dry Grapes Benefits) :
ఎండు ద్రాక్ష కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ వలన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే ఎండు ద్రాక్ష తరచుగా తీసుకోవడం వలన మలబద్ధకం అంటే సమస్యను దూరం చేయవచ్చు. ఇందులో ఉండే పొటాషియం వలన కండరాలు ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వలన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ నీ పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఎండు ద్రాక్షలో లభించే యాంటీ క్యాన్సర్ లక్షణాలు వలన క్యాన్సర్ బారినుండి తప్పించుకోవచ్చు.

ఎండు ద్రాక్షను తరచుగా తీసుకోవడం వల్ల ఇలా ఒకటి తరచుగా తీసుకోవడం వల్ల ఇలా ఒకటి కాదు ఎన్నో లాభాలను పొందవచ్చు. ఇక ఇందులో లభించే ఐరన్ వలన రక్తహీనత సమస్యను దూరం చేయవచ్చు. అంతే కాకుండా శరీరంలోని కాపర్ రెడ్ బ్లడ్ సెల్స్ ని పెంచడానికి ఎండుద్రాక్ష ఎంతగానో సహాయపడుతుంది.
ఖర్జూరం (Eating Dates) :
ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్జూరం ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలోని హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచుకోవచ్చు. ఖర్జూర పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి రోజంతా హుషారుగా ఉండేలా చేస్తాయి. ఖర్జూర పండ్లు తక్షణ శక్తిని ఇవ్వడంలో ఎంతగానో సహాయపడతాయి.

ఖర్జూర పండ్లు జీర్ణశక్తి మెరుగు పడేలా చేస్తాయి. ఖర్జూర పండు రోజు తీసుకోవడం వల్ల వాతం వంటి సమస్యలను దూరం చేయవచ్చు. ఖర్జూరం లో లభించే ఐరన్ వలన రక్తహీనత సమస్యను దూరం చేయవచ్చు. ఇక ఈ విధంగా ఖర్జూర పండ్లను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
Read Also : Health tips: బెల్లాన్ని ఇలా వాడితే.. మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలకు చెక్!