...

Napping : తరచూ నిద్రపోవడం వల్ల స్ట్రోక్, హైబీపీ వస్తాయట.. జాగ్రత్త సుమీ!

Napping : నిద్ర శరీరానికి చాలా అవసరం. నిద్ర వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చాలా మంది చెప్తూనే ఉంటారు. కంటి నిండా నిద్ర లేకపోతే ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. కళ్లు ఎర్రబడడం, రెడ్ సర్కిల్స్, అలసట, తలనొప్పి లాంటి చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. అలా అని మరీ ఎక్కువ సేప పడుకున్నా చాలా సమస్యలు వస్తాయట. ముఖ్యంగా తరచుగా నిద్రపోయే వాళ్లకు అధిక రక్తపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తేలింది. నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అతి నిద్ర అంతే సమస్యలను తెచ్చి పెడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

పగటి పూట కునుకు వేయడం ఏమాత్రం సరికాదని అధ్యయనాలు తేల్చాయి. అయితే రాత్రి పూట తగినంత నిద్రలేకపోతే పగటి నిద్ర వల్ల మంచే జరుగుతుందట. కానీ శరీరానికి సరైన విశ్రాంతి లేకపోతే అది ఇతర సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వాళ్లలోనే అధిక రక్తపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశఆలు ఎక్కువగా కనిపించాయని చెప్పారు. మద్యాహ్న భోజనం తర్వాత కేవలం అరగంట వరకు మాత్రమే నిద్రపోవాలని సూచిస్తారు. అంతకంటే ఎక్కువ పోతే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మధ్య వయస్కులకు 15 నుంచి 30 నిమిషాల పగటి నిద్ర చాలని వివరిస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి.. అతి నిద్రనూ దూరం చేసుకోండి.