Health Tips : సాధారణం మనం ఏదేని పని చేస్తున్నపుడు అలానే చాలా సేపు కూర్చుని ఉంటే తిమ్మిర్లు వస్తుంటాయి. అలా మన శరీరంలోని ఏదో ఒక పార్ట్‌కు తిమ్మిర్లు రావడం మనం గమనించొచ్చు. అయితే, ఆ సమయంలో మనకు స్పర్శ అనేది అస్సలు తెలియదు. నిజానికి ఆ టైంలో మనకు మెదడు నుంచి నరాల ద్వారా సంకేతాలు అందవు. ఆ నేపథ్యంలోనే తిమ్మిర్లు వస్తుంటాయి. ఉదాహరణకు చేతి భాగంలో తిమ్మిర్లు వస్తే ఆ భాగానికి రక్త సరఫరా ఆగిపోతుంటుంది. అలా నరాలపై ఒత్తిడి పెరుగుతుంటుంది. ఈ సమయంలో చేతిని ముట్టుకుంటే మనకు అస్సలు స్పర్శ తెలియదు.

Health Tips : 5 Simple Home Remedies To Ease Numbness In Hands in telugu
ఇలా తిమ్మిర్లు వచ్చిన సమయంలో మనం ఎటువంటి ఖంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అయితే, ఎప్పుడో ఒకసారి తిమ్మిర్లు వస్తే ఏం కాదు. కానీ, మీకు కనుక రెగ్యులర్‌గా తిమ్మిర్లు వస్తే ప్రమాదమే. అలా మీ శరీరంలోని ఏదేని ఒక అవయవానికి రక్త సరఫరా ఆగిపోయిందంటే ప్రమాదకమే కాబట్టి తరచూ తిమ్మిర్లు వచ్చే వాళ్లు కంపల్సరీగా ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇకపోతే ఈ తిమ్మిర్లు రాకుండా ఉండేందుకుగాను కొన్ని టెక్నిక్స్ ఫాలో కావాలట.
అవేంటంటే.. రాత్రి వేళ నిద్రపోయే టైంలో మెడను పద్ధతిగా స్ట్రెయిట్‌గా ఉంచుకోవాలి. కళ్లు ఆకాశం వైపు చూసినట్లుగా తల ఉంచుకోవడంతో పాటు పొట్ట స్ట్రెయిట్‌గా ఉంచాలి. అనగా పొట్ట ఆకాశం వైపు చూస్తున్నట్లు పడుకోవాలి. అలా చేయడం వలన మెడ దగ్గరి నుంచి నరాల వరకు ఏవి కూడా దెబ్బతినకుండా ఉంటాయిన వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ఎక్కువ సేపు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఉండటం వలన కూడా మీకు తిమ్మిర్లు వచ్చే ప్రమాదముంటుంది. ఈ నేపథ్యంలో మీకు కనుక పదే పదే తిమ్మిర్లు వస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించడమే మంచిది.
Read Also : Health Tips: కళ్ళల్లో కనిపించే ఈ లక్షణాలతో శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ని గుర్తించవచ్చు..?