...

Gurivinda Ginjalu : గురివింద గింజతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..

Gurivinda Ginjalu : గురివింద గింజ(గురిజలు)తో బోలెడు ప్రయోజనాలున్నాయి. కానీ, వీటి గురించి చాలా మందికి తెలీదు. చేసేది ఏమీ లేకున్నా గొప్పలు చెప్పుకునే వాడిని గురివిందతో పోలుస్తారని మీకు తెలుసా.. వీటిని బంగారం కొలువడానికి కూడా ఉయోగిస్తారు. గురువిందను లక్ష్మీదేవీ స్వరూపంగా కూడా కొలుస్తారట. గురవిదంలో ఆకుపచ్చ, తెలుగు, పసుపు, నలుపు రకాల్లో దొరకుతాయి. ఇది సాధారణంగా బయట కనిపించదు. కానీ, ఈ తీగ ఆకులు, కాండంలో మంచి ఔషధ గుణాలున్నాయి. మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

గురివింద ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందంటే..

ఆయుర్వేదంలో గురివింద గింజలను పూర్వం నుంచే వాడుతున్నారు. ఈ గింజల పై పొట్టు తీసి లోపల గుజ్జును నువ్వుల నూనె కలుపుకోవాలి. పేనుకొరుకుడు సమస్య ఉన్న వారు ఈ ఆయిల్ అక్కడ రాస్తే వెంట్రుకలు తిరిగి మొలుస్తాయి. ఈ గింజల పొడిని గంధంతో కలిపి పేనుకొరుకుడు ఉన్నచోట రాసినా మెరుగైన ఫలితం ఉంటుంది. ఈ గింజల పొడితో ఇంట్లో పొగ వేస్తే దోమల సమస్య ఉండదు.
గురువింద చెట్టు ఆకులను మెత్తగా నూరుకుని రసం తీయాలి. దీనిని చెవిపోటు ఉన్నవారు రెండు చుక్కలు వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. ఆకుల నుంచి తీసిన రసానికి చక్కెర కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది. గురివింద ఆకులను తింటే బొంగురు గొంతు ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టొచ్చు.

అంతేకాకుండా, గురివింద ఆకుల రసాన్ని తీసి చర్మంపై తెల్ల మచ్చలు ఉన్న చోట రాయాలి. ఒక 15 నిమిషాలు ఎండలో ఉన్నాక స్నానం చేయాలి. ఇలా క్రమంగా చేస్తే తెల్లమచ్చలు తగ్గిపోతాయి. ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి నువ్వుల నూనెలో కలుపుకుని బాగా మరిగించాలి.ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుని క్రమంగా తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు కుదుళ్లు బలంగా, ఒత్తుగా మారుతాయి.
Read Also : Eluka Jemudu Plant : ఎలుక జెముడు మొక్క గురించి విన్నారా..!? ఈ మొక్కతో ప్రపంచాన్ని వణికించే ఈ వ్యాధికి చెక్..!!

Read Also :  Kanuga Health Benefits : కానుగ చెట్టు ఆరోగ్యానికి అందించే కానుకలు ఇవే..!!