Green Tea Side Effects : గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గిపోతారని.. చాలా మంది ఎక్కువగా తాగేస్తుంటారు. గ్రీన్ టీ బరువు తగ్గిస్తుందనేది నిజమే అయినప్పటికీ… ఎక్కువగా తాగకూడదు. రోజుకు రెండు, మూడు కప్పులు తాగితే ఫరవాలేదు కానీ అంతకు మించి తాగితే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. అయితే ఆ దుష్ప్రభావాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియ సమస్య… అసలైన టానిన్ మూలకం గ్రీన్ టీలో ఉంటుంది.
ఇది కడుపులో ఎసిడిటీ సమస్యను పెంచుతుంది. గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. తలనొప్పి.. రోజుకు రెండు నుండి మూడు కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే తలనొప్పి సమస్య తగ్గుతుంది. కానీ ఎక్కువగా గ్రీన్ టీని తీసుకుంటే అది మైగ్రేన్ సమస్యను పెంచుతుంది. నిద్ర లేకపోవడం.. గ్రీన్ టీలో కెఫిన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగితే నిద్ర విధానంలో సమస్య ఉంటుంది. ఇది మెలటోనిన్ హార్మోన్ లో అసమతుల్యతను కల్గిస్తుంది. ఇది నిద్ర సమస్యలకు దారి తీస్తుంది. అలాగే రక్తహీనత, వాంతులు అవుతుంటాయి. అందుకే ఎక్కువగా గ్రీన్ టీ ని తాగకండి.
Read Also : Astro tips : నాగకేసరి పువ్వు ఒక్కటి చాలు.. లక్ష్మీదేవి కటాక్షం మీ వెంటే!