Donkey Milk : పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే. అయితే గాడిద పాలు తాగితే మరింత మంచిదని చెబుతుంటారు చాలా మంది. అయితే దీర్ఘకాళికంగా వేధిస్తున్న రోగాలను మటుమాయం అవుతాయనే నానుడి ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఇప్పుడు ఆ పాలు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తున్నారు. ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకుంటున్న పాలు ఇంటి దగ్గరకే రావడంతో జనం ఎగబడి మరీ కొంటున్నారు. అయితే లీటర్ అర లీటరో కారు కేవలం 10 ఎంఎల్, 20 ఎంఎల్ మోతాదులో కొనుగోలు చేస్తున్నారు. అదేంటి లీటర్ కొనుక్కోవచ్చుగా అంటే ఈ పాల ధర అంత ఖరీదు కాబట్టే కొద్దిగా మాత్రమే కొనుక్కొని రోగాలను నయం చేస్కుంటారు.
సంగారెడ్డి జిల్లాలో గాడిద పాలు అమ్ముకోవడానికి మహారాష్ట్ర నుంచి వచ్చాడో యువకుడు. చూడటానికి టిప్, టిప్ గా కనిపిస్తున్న యువకుడు గాడిదతో పాటు ఓ సంచిని భుజాన వేస్కొని జహీరాబాద్ టౌన్ లో దిగిపోయాడు. ఆవు పాలు, గేదె పాలు ఎక్కడైనా దొరుకుతాయి. కానీ దగ్గు, ఉబ్బసం, దమ్ము, మూర్చ వంటి వ్యాధులను నయం చేసే గాడిద పాలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరకవు కాబట్టి మహారాష్ట్రలోని నాందెడ్ కు చెందిన బాలాజీ గాడిదను తీస్కొని సంగారెడ్డి జిల్లా కోహిర్ పట్టణంలో పాలు అమ్ముతున్నాడు.
గాడిదలో పాలతో వైద్యంతో పూర్తిగా నయం కాని జబ్బులు తగ్గుతాయనే నానుడి ఉంది. అందులో భాగంగానే గాడిద పాలు లీటర్ చొప్పున కాకుండా మిల్లీ లీటరల్లలో అమ్ముతున్నాడు. అసలు ఈ గాడిద పాలకు డిమాండ్ ఎంత ఉందో తెలియాలంటే ముందు వాటి ధర తెలుసుకోవాలి. లీటర్ గాడిద పాలు అకక్షరాలు పది వేలకు అమ్ముతున్నాడు బాలాజీ. లీటర్ పది వేలు కావడంతో ఒక్కొక్కరు కేవలం 100 రూపాయలు ఇచ్చి 10 మిల్లీ లీటర్ల పాలను ఓ జండూబామ్ సీసాలో పోయించుకుంటున్నారు.
Read Also : Cuddle Therapy : అతని కౌగిలిలో బందీ కావాలంటే గంటకు 7000 చెల్లించాల్సిందే..?