...

Health Tips: ఉడికించిన శెనగలు తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

Health Tips: పిల్లలు, టీనేజర్లు ఎక్కువగా ఆటలాడుతుంటారు. వీరికి సమయానికి తినాలి అన్న ధ్యాస కూడా ఉండదు. అందువలన పిల్లలకు ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారాన్ని అందించడం శ్రేయస్కరం. వీరు రోజుకి కనీసం ఉదయం, సాయంత్రం కలిపి అర లీటర్ పాలు తాగేలా చూడాలి. రోజులో కనీసం గుప్పెడు డ్రై ఫ్రూట్ తినడం మంచిది. ఉడికించిన శనగలు, బొబ్బర్లు ఎక్కువ సేపు శక్తిని కలిగిస్తాయి. వాలి బాల్, క్రికెట్ లాంటి ఆటలు ఆడే పిల్లలకు అవసరమైన శక్తి కోసం ఉడికించిన శనగలు, బొబ్బర్లు పెట్టడం వల్ల వారు ఎక్కువ సేపు శక్తివంతంగా ఉంటారు. వీటిని పిల్లలకు స్నాక్స్ లాగా ఇవ్వడం మంచిది.

చిలగడ దుంప లో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది. సాధారణంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల బరువును నియంత్రిస్తుంది. చిలగడదుంపలు తినటం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు, ఫలితంగా బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది. వీటిని ఉడకబెట్టి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. నారింజ, బత్తాయి లాంటి సిట్రస్ పండ్లను తినడం వల్ల పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల ఫ్లూ, జలుబు, జ్వరం వ్యాధులను నివారిస్తుంది.

ప్రతి రోజూ అరగంట వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల శరీరంలోని విషతుల్య మలినాలు తొలగిపోతాయి. వీటిలో ముఖ్యంగా సూర్య నమస్కారాలు, ప్రాణాయామం వంటి శ్వాస సంబంధిత ప్రక్రియలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచగలవు. యోగా చేయడం వల్ల ఊపిరితిత్తులను బల పరచడమే కాకుండా, శుభ్రం కూడా చేస్తుంది. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక ఒత్తిడికి దూరం కావచ్చు.