...

Health Tips: శరీర బరువు తగ్గాలని రాత్రి భోజనం మానేశారా… అయితే పెద్ద తప్పు చేస్తున్నట్లే!

Health Tips: అధిక శరీర బరువుతో బాధపడేవారు శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల డైట్ లనుఫాలో అవ్వడమే కాకుండా వివిధ రకాల శరీర వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే శరీర బరువు తగ్గడం కోసం మరికొందరు రాత్రిపూట భోజనం చేయడం పూర్తిగా మానేస్తారు. ఇలా భోజనం మానేయడం వల్ల శరీర బరువు తగ్గుతారని భావిస్తుంటారు.అయితే ఇదే నిజం అనుకుని రాత్రి పూట అన్నం తినడం మానేస్తే చాలా సమస్యలలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ప్రతి రోజూ ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చేస్తాము.అయితే మధ్యాహ్న భోజనం నుంచి రాత్రి భోజనానికి మధ్య చాలా సమయం వ్యత్యాసం ఉంటుంది. ఈ క్రమంలోనే తిరిగి రాత్రి కూడా భోజనం చేయక పోవడంతో మన శరీరం వెంటనే అలసిపోతుంది.అందుకే రాత్రిపూట ఏదైనా తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవాలి కానీ పూర్తిగా ఆహారానికి దూరంగా ఉండ కూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇలా మధ్యాహ్నం తరువాత మరుసటి రోజు ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో విడుదలయ్యే జీర్ణ రసాల వల్ల కడుపులో మంటగా ఉంటుంది. అదేవిధంగా తీవ్రమైన తలనొప్పి చిరాకు రావడం కూడా మొదలవుతాయి.అందుకే రాత్రి సమయంలో తేలికపాటి అల్పాహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా మన దరి చేరవు.ఇలా ఎక్కువ సమయం పాటు ఆహారం తినకపోవడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలను కోల్పోవలసి వస్తుంది తద్వారా రక్తహీనత, నీరసంగా మారిపోవడం, బలహీనంగా తయారవడం వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.