Coffee powder : ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే వేడి వేడి కాఫీ తాగనిదే రోజు మొదలు కాదు. ముఖ్యంగా రోులో రెండు నుంచి నాలుగు సార్లు కాఫీ తాగుతుంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అందుకే చాలా మంది కాఫీని ఆస్వాదిస్తుంటారు. దీన్ని తాగితే అప్పటికప్పుడు శక్తి వచ్చినట్లుగా ఉంటుంది. అయితే కాఫీ తాగడం మంచిదా, కాదా… ఎలాంటి లాభాలు కల్గుతాయనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కాఫీ తాగడం వల్ల షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది. దీన్ని తాగడం వ్లల శరీరంలోని ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే సాధారణ కాఫీ తాగాలి. అదనంగా కొవ్వు, క్యాలరీలు చేర్చడం చేయొద్దని చెబుతున్నారు. అంటే పంచదార, స్వీటనర్స్, ఎక్కువగా యాడ్ చేయొద్దని సూచిస్తున్నారు.
కాఫీలోని ప్రత్యేక గుణాలు క్యాన్సర్ రిస్క్ ని 12 శాతం తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాలా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని చెబుతున్నారు. కాఫీ తాగని వారితో పోల్చితే… క్యాన్సర్ రిస్క్ ఉండదని అంటున్నారు. చర్మ, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. అలాగే కాఫీని రోజూ తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి. దీనిలో ఉండే యాంటీ అక్సిడెంట్స్ ఎప్పటికీ ఆనందంగా ఉండేందుకు సాయపడతాయి. అయితే మోతాదుకు మించి కాఫీ తాగడం మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోజుకి 2 కప్పుల కాఫీ తాగితే మంచిదే కానీ అంతకంటే ఎక్కువ తాగితే మాత్రం పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరిస్తున్నారు.
Read Also : Coffee with cigarettes : కాఫీ, టీ తాగుతూ సిగరెట్లు కాల్చే అలవాటు ఉందా మీకు.. అయితే కష్టమే!