Coriander: ఉడికిన ఆహారంపై ప్రతీ ఒక్కరూ అలా అలా చల్లే కొత్తిమీర ఆకుల వాసన చూసినా, ఆకారం చూసినా నోరూరకుండా ఉండదు. అయితే గార్నిష్ కోసం వాడే ఈ కొత్తిమీరలో అనేక రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తమీర ముఖ్యంగా మూత్రంలోని ట్యాక్సిన్లను క్లీన్ చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. అదనంగా, లవణాల ద్వారా ఏర్పడిన శిల ప్రారంభ దశలో కరిగిపోతుంది. అలాగే శరీరంలో పేరుకునే అనవసర కొవ్వులను కరిగించి శరీర బరువును అదుపులో ఉంచుతుంది. కడుపు నొప్పి, జీర్ణ సమస్యలను సరియేడానికి సహాయపడుతుంది.
కడుపులో వచ్చే క్యాన్సర్ ను తొలి దశలో చంపే శక్తి కూడా దీనికి ఉంది. కొత్తిమీర మధుమేహ వ్యాధి గ్రస్తులకు మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. నోటి పుండ్లు, నోటి దుర్వాసన ఉన్నవారు కొత్తిమీర తినడం చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ సెప్టిక్ మాలిక్యూల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కంటి ఆరోగ్యాన్ని బాగుచేయడంలో కొత్తిమీర కీలక పాత్ర పోషిస్తుంది. రక్తప్రవాహాన్ని సజావుగా సక్రియం చేయడంలో సహాయ పడుతుంది. రక్తహీనతను కొంత వరకు నయం చేస్తుంది.