Love Relationship : ‘కాదల్, ఇష్క్, ప్రేమ, లవ్, ప్రీతి’ ఇలా.. రెండక్షరాల పేర్లు ఏవైనా ప్రేమ మాత్రం అనిర్వచనీయమైనది. స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే ఈ రిలేషన్ బలంగా ముందుకు సాగాలంటే ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ కీలకం. ఇక ఒకసారి ప్రేమలో పడ్డారంటే చాలు.. ఒకరి థాట్స్‌ను మరొకరు షేర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. ప్రతీ ఒక్క విషయమై చర్చించుకుంటారు. అయితే, ప్రియురాలితో ప్రేమలో ఉన్న ప్రతీ ఒక్క పురుషుడు ఈ పనులు తప్పకుండా చేయాలనుకుంటాడట. అవేంటో తెలుసుకుందాం.
భావోద్వేగాలు అనేవి అందరికీ ఉంటాయి. అందులో లింగ భేదాలు అంటూ ఏమీ ఉండబోవు. కానీ, వ్యక్తపరచేందుకు స్త్రీలు జంకుతుంటారు. పురుషులు ఎటువంటి భయం లేకుండా బయటకు తమ మనసులో ఉన్న మాటలను వ్యక్తపరుస్తుంటారు. కాగా, ప్రియురాలను పురుషుడు తప్పకుండా ప్రతీ ఒక్కరికి పరిచయం చేస్తుంటాడట. ప్రేమలో ఉన్నపుడు ఆమెను ఎప్పుడెప్పుడు కలవాలని తహతహలాడుతుండాట. ఈ క్రమంలోనే ప్రియురాలికి ప్రతీ విషయమై ప్రయారిటీ ఇస్తుంటాడు. ఏదేని విషయమై ప్రియురాలి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తుంటాడు కూడా.
ఈ క్రమంలోనే ప్రియురాలు చెప్పే ప్రతీ విషయాన్ని శ్రద్ధగా విని, ఆ విషయంపైన మగాడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంటాడు. ఇక ప్రియురాలిని సరదాగా టీజ్ చేయడానికి పురుషుడు ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. అలా టీజ్ చేయడాన్ని బట్టి అతడు మీ పట్ల చాలా ఇష్టంగా ఉన్నాడన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే ప్రేమలో ఉన్నపుడు చాలా మంది పురుషులు మిగతా వారికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు.
వారి వ్యవహార శైలి, వైఖరిలో చాలా మార్పులొస్తుంటాయి. అతడు ప్రియురాలి కోసం పరితపిస్తుండటంతో పాటు ఆమెకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా అతి జాగ్రత్తగా డీల్ చేస్తుంటాడు. ప్రతీ పురుషుడు తన ప్రియురాలితో రొమాన్స్ చేయాలని అనుకుంటాడు.
Read Also : Tamarind Seeds : చింతగింజలతో ఇలా చేస్తే ఈ నొప్పులు జన్మలో రావు..!!