Vijay devarakonda: ఆహా డ్యాన్స్ ఐకాన్ కంటెస్టెంట్ కు విజయ్ దేవరకొండ సాయం, ఏం చేశారంటే?

Vijay devarakonda: కష్టాల్లో ఉన్న పేదవారికి సాయం అందించడంలో తెలుగు నటీనటులు ఎప్పుడూ ముందే ఉంటారు. ముఖ్యంగా అభిమానులకు చిన్న కష్టం వచ్చినా మేమున్నామని భరోసా కల్గించడమే కాకుండా ఆర్థికంగా సాయం చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు. సమంత వంటి పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు కూడా వందలాది మందికి హెల్ప్ చేశారు. తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా తన మంచి మనసు చాటుకున్నారు. ఓ అభిమాని కష్టం విని చలించిపోయారు. అథని తల్లి త్రోట్ క్యాన్సర్ తో బాధపడడం.. వేస్కోవడానికి సరైన బట్టలు కూడా లేని ఓ పేద డ్యాన్స్ కష్టాలు ఎదుర్కోవడానికి తాను సాయం చేస్తానన్నారు.

Advertisement

Advertisement

షోకోసం సరైన బట్టలు కూడా లేకపోవడంతో సాధారణ దుస్తులతో పాల్గొంటున్నట్లు ఓంకార్ చెప్పగా చలించిపోయిన విజయ్ దేవరకొండ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. తాను ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు రోజులను గుర్తు చేసుకున్నారు. తన మొదటి సినిమా ప్రమోషన్లకు సరైన బట్టలు లేక ప్రొడ్యూసర్ ను అడిగి సినిమాలో ఉపయోగించిన కాస్ట్యూమ్స్ నే వేస్కున్నట్లు వివరించారు. అయితే తన సొంత బ్రాండ్ అయిన రౌడీ వేర్ నుంచి పంపుతామని… తనకు నచ్చిన దుస్తులను ఎంచుకోవచ్చని తెలిపారు. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

Advertisement