September 21, 2024

Samantha : ఆ పాట నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.. మరోసారి ఐటమ్ సాంగ్ పై సమంత షాకింగ్ కామెంట్స్!

1 min read
pjimage 14

Samantha : సమంత తన సినిమా కెరీర్ లో దూసుకుపోతూనే వ్యాపారంలోను అడుగుపెడుతూ తన సత్తా చూపిస్తోంది.. అలా తన మార్కును ఇటు సినీరంగం పైన అటు వ్యాపార రంగం పైన వేస్తోంది. సమంత అనగానే అందరి హీరోలతో హిట్ సినిమాలు తీసిన లక్కీగర్ల్ గా అనిపిస్తుంది. తన కెరీర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ మంచి ప్రాజెక్టలను ఎంచుకుంటుంతోంది సామ్. కొన్నిసార్లు చాలా బోల్డ్ కామెంట్స్,ఫొటోస్ తో ట్రోల్ కి కూడా బాగానే గురవుతుంది.

pjimage 14తను నటించిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయింది.నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి తర్వాత విడాకులతో కూడా అంతే దృడంగా తన కెరీర్ లో దూసుకుపోతోంది. ఇక ఇటీవల సమంత చేసిన ఊ అంటావా మావ ఊహు అంటావా పాట ఇండియాని ఒక ఊపు ఉపేసింది. పుష్ప సినిమాలోని ఈ పాట సమంత కు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఇంతలా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సాంగ్ గురించి తాజాగా సమంత స్పందించింది, సమంత ఇటీవల ముంబయిలో జరిగిన క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది సమంత, అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేను. పుష్ప మూవీ లోని ‘ఊ అంటావా’ పాట పాన్‌ ఇండియా లెవల్‌ లో ఈ రేంజ్‌ విజయాన్ని అందుకుంటుందని ఊహించలేదు అని సమంత తెలియజేసింది, తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులంతా నేను ఇప్పటి వరకు చేసిన మూవీ లను మర్చిపోయారు, ‘ఊ అంటావా’ సాంగ్ తోనే నన్ను గుర్తు పెట్టుకుంటున్నారు అంటూ సమంత చెప్పుకొచ్చింది.