Jayamma Panchayithi : యాంకర్ గా సుమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. అయితే అంతకు ముందు ఆమె సీరియల్స్ మరియు సినిమాల్లో నటించిన విషయం ఈ జనరేషన్ వారికి తెలియక పోవచ్చు. సుమ అప్పుడప్పుడు గెస్ట్ గా వెండి తెరపై కనిపించింది. కాని పూర్తి స్థాయిలో మాత్రం కనిపించలేదు. ఇన్నాళ్లుగా సుమ ను బుల్లి తెరపై చూసి ఎంటర్ టైన్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు వెండి తెరపై జయమ్మ పంచాయితీ సినిమాతో చూడబోతున్నారు. సినిమాకు తన ఇమేజ్ ను పలుకుబడిని ఉపయోగించి భారీగా ప్రమోషన్ చేసింది.
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని, నాగార్జున, సుడిగాలి సుధీర్ ఇంకా చాలా మంది స్టార్స్ కూడా జయమ్మ పంచాయితీ కోసం టైమ్ కేటాయించారు. విడుదలకు మరో రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మరెంత మంది సెలబ్రెటీలు జయమ్మ పంచాయితీ గురించి మాట్లాడుతారో చూడాలి. ఇంత మంది ఆశీర్వాదం ఉన్న జయమ్మ పంచాయితీ పై తప్పకుండా అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. అందుకే భారీ గా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.
సినిమాకు నిర్మాతలు కేవలం రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చులు చేసి ప్రమోషన్ ఇతర కార్యక్రమాలకు మరో 50 లక్షలు ఖర్చు చేశారట. మొత్తంగా సినిమా కు మూడు కోట్ల వరకు ఖర్చు అయ్యిందని అంటున్నారు. సినిమా ఆలస్యం అవ్వడం వల్ల కాస్త బడ్జెట్ పెరిగినా కూడా నాలుగు కోట్ల కంటే ఎక్కువ ఈ సినిమా కు అయ్యి ఉండదు. కాని ఈ సినిమా కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారా 11.5 కోట్ల రూపాయలను దక్కించుకుందట. సినిమా సక్సెస్ అయితే మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీగానే నిర్మాతకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఒక యంగ్ స్టార్ హీరో రేంజ్ లో సుమ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే టాక్ వినిపిస్తుంది.