Sravana Bhargavi : శ్రావణ భార్గవికి కోట్లు తెచ్చిపెట్టిన వివాదం.. ఆ వీడియో డిలీట్ చేసి.. మరో వీడియో వదిలిందిగా!

Singer Sravana Bhargavi Video Deleted After Annamayya Devotees Hurt, Later She Uploaded New Video

Sravana Bhargavi : ఒకపరి అన్నమయ్య సంకీర్తన వీడియోతో సింగర్ శ్రావణ భార్గవి (Sravana Bhargavi ) వివాదంలో చిక్కుకుంది. అన్నమాచార్య కీర్తనపై వివాదానికి దారితీయడంతో శ్రావణ భార్గవి ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేసింది. అంతేకాదు.. తన యూట్యూబ్‌ ఛానల్‌తో పాటు ఇతర అన్ని ప్లాట్‌ఫామ్స్‌ నుంచి ఆ వీడియో కంటెంట్‌ డిలీట్ చేస్తున్న్టట్టు ఇన్‌స్టా అకౌంట్లో ప్రకటించింది శ్రావణ భార్గవి. అయితే, ఆ వీడియోను డిలీట్ చేసిన వెంటనే మరో వీడియోను పెట్టేసింది. ఇప్పుడా వీడియోలో ఆడియోను మార్చేసింది. కీర్తనకు సంబంధించి క్లిపులను తొలగించి వీడియోను వదిలింది. కొన్నిరోజులుగా ఒకపరి సంకీర్తన వీడియోపై శ్రావణ భార్గవకి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అన్నమయ్య భక్తి పాటను ఇంత అశ్లీలంగా చిత్రీకరించావంటూ భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Singer Sravana Bhargavi Video Deleted After Annamayya Devotees Hurt, Later She Uploaded New Video
Singer Sravana Bhargavi Video Deleted After Annamayya Devotees Hurt, Later She Uploaded New Video

శ్రావణ భార్గవి పాడిన పాటలతో పాటు పలు సినిమాల్లోని అన్నమాచార్య పాటలపై కూడా చట్టపరమైన చర్యలకు అన్నమయ్య వంశీకులు సిద్ధమయ్యారు. అన్నమయ్య సంకీర్తనలను మూవీల్లో అసభ్యకరంగా చూపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అన్నమయ్య వంశీకులు టీటీడీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక ఎట్టకేలకు శ్రావణ భార్గవి వెనక్కి తగ్గింది. ఆ వీడియోను డిలీట్ చేసి.. ఆ స్థానంలో మరో వీడియోను పెడతానని ప్రకటించింది. ఎట్టి పరిస్థితిల్లోనూ తాను ఆ సాంగ్ డిలీట్ చేయను అని మంకుపట్టు పట్టిన శ్రావణ భార్గవి ఎట్టకేలకు తనపై వస్తున్న వివాదాలను తట్టుకోలేక చివరకు ఆ పాటను డిలీట్ చేసింది.

Advertisement

Sravana Bhargavi : శ్రావణ భార్గవి వీడియోకు మిలియన్ల వ్యూస్.. ఆడియో మార్చేసి మరో వీడియో.. 

ఏదిఏమైనా.. శ్రావణ భార్గవి ఒకపరి కీర్తన వీడియోకు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చిపడ్డాయి. 1.16 నిమిషాల నిడివి ఉన్న వీడియో యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ఇప్పటికే 1.6 మిలియన్ల వ్యూయర్స్ (కోట్ల వ్యూస్) క్రాస్ చేసి టాప్ 27 లిస్టులో వీడియో నిలిచింది. ఈ వీడియో సాంగ్ అంతగా పాపులర్ కావడానికి శ్రావాణ భార్గవిపై నడుస్తున్న వివాదమే కారణం.. దాంతో అందరూ అసలు శ్రావణ భార్గవి పాడిన పాటలో ఏముంది అంటూ చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. దాంతో శ్రావణ భార్గవి ఒకపరి సాంగ్ ఒక్కసారిగా టాప్ ట్రెండ్‌లో నిలిచింది. దాంతో శ్రావణ భార్గవి వీడియోకు కోట్లాది వ్యూస్ వచ్చాయట.. అదే వీడియోకు బ్యాక్ గ్రౌండ్ ఆడియో మ్యూజిక్ మార్చేసి మళ్లీ అప్‌లోడ్‌ చేసింది.

Advertisement

అసలేం జరిగిందంటే..?
జూలై 16న శ్రావణ భార్గవి తన సొంత యూట్యూబ్ ఛానల్ లో అన్నమయ్య ఒకపరి కీర్తన ను తాను స్వయంగా పాడి అభినయిస్తూ 1.16 నిమిషాల నిడివితో వీడియో విడుదల చేసింది. ఈ సాంగ్ అంత వైరల్ కావడానికి కారణం అమ్మపై నడుస్తున్న వివాదమే. వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తూ భక్తిభావంతో పాడిన పాటను తాను అపహాస్యం చేసిందంటూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఆ పాటలో తన అందాన్ని పొగుడుకోవడం కోసం మాత్రమే పాడిందని విమర్శించారు. ఆ పాటలో పడుకొని కాళ్లు ఊపుతూ కీర్తన పాడిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే సినీనటి కరాటి కళ్యాణి కూడా ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చింది.

Singer Sravana Bhargavi Video Deleted After Annamayya Devotees Hurt, Later She Uploaded New Video
Singer Sravana Bhargavi Video Deleted After Annamayya Devotees Hurt, Later She Uploaded New Video

శ్రావణ భార్గవి తన కాళ్లకు మెట్టెలు లేవని అలాగే మెడలో తాళిబొట్టు కూడా లేదని హిందూ సమాజం ఏమైపోవాలి అన్నట్టు ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యింది. కీర్తనలు పాడేటప్పుడు మీ పైత్యాన్ని ఇందులో చూపించొద్దు అంటూ కరాటే కల్యాణి సెటైర్లు వేసింది. ఏ కీర్తన అయినా అభ్యంతరకరంగా ఉంటే దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందేనని డిమాండ్ చేసింది. భార్గవి పాడిన పాట నాకు అభ్యంతరకరంగా ఉందని, అందులో కొన్ని క్లిప్పులను తొలగించి చిన్న చిన్న ఎడిటింగ్ చేయాల్సిందే అంటూ కరాఖండిగా తేల్చి చెప్పింది. శ్రావణ భార్గవి పాడిన పాట ఫుల్ ట్రెండింగ్ కావడంతో ఆమె పాడిన ఒకపరి సాంగ్ టాప్ ట్రెండ్‌లోకి దూసుకెళ్లింది.

Advertisement

డిలీట్ చేసిన వీడియో ఇదే :

Advertisement

Read Also : Sravana bhargavi: బొచ్చు పీకేసిన కోడిలా ఉన్నావంటూ శ్రావణ భార్గవిపై శ్వేతారెడ్డి ఫైర్!

Advertisement