YS Bharathi: మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 17వ తేదీ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.కలెక్షన్ల పరంగా విజయపథంలో దూసుకుపోయిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎంతో మంది సినీ ప్రముఖులు సినిమాపై స్పందించి ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను ఏపీ ముఖ్యమంత్రి దంపతులు చూసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన అనంతరం ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు మహేష్ బాబు సినిమాలంటే చాలా ఇష్టమని తప్పకుండా తన సినిమాలు చూస్తానని భారతి తెలిపారు.ఇక సర్కారు వారి పాట గురించి మాట్లాడుతూ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్ ను ఈ సినిమా ఆకట్టుకుంటుందని తెలిపారు.
ముఖ్యంగా డబ్బు విషయంలో మహేష్ నటన చాలా బాగుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో నేను ఉన్నాను,నేను విన్నాను అనే డైలాగ్ తనకు ఎంతగానో నచ్చిందని భారతి ఈ సందర్భంగా మహేష్ బాబు సినిమా గురించి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా గురించి భారతి రివ్యూ ఇవ్వడంతో ఈమె చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also :Student interaction with cm jagan: ఆ పిల్లాడు ఐఏఎస్ అయ్యేదాకా.. జగనే సీఎంగా ఉండాలట!
Tufan9 Telugu News And Updates Breaking News All over World