Sridevi Drama Company: టాలీవుడ్ లో బుల్లితెర మీద ప్రసారమయ్యే కామెడీ షో లలో ది బెస్ట్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది జబర్దస్త్. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది నవ్విస్తూ ఎంతోమందికి జీవితాన్నిచ్చిన ఈ జబర్దస్త్ టాలీవుడ్ లో అన్ని కామెడీ షో ల కంటే ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రతి గురు, శుక్ర వారాలలో 9:30 కు ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో ఎంతోమంది కమెడియన్లు తమ కామెడీ ద్వారా ప్రజలను కడుపుబ్బ నవ్విస్తున్నారు. అంతేకాకుండా ఈ ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా, సింగర్ మనో కూడా కమెడియన్ ల మీద పంచులు వేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ షాపు యాంకర్లుగా వ్యవహరిస్తున్న అనసూయ, రష్మీ కూడా తమ అందచందాలతో డాన్సులతో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు.
ఇటీవల ఈటీవీ లో ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షో కూడా మంచి ప్రజాదరణ పొందింది. జబర్దస్త్ కు ఏమాత్రం తీసుకోకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షో కూడా ప్రజలను బాగా ఎంటర్టైన్ చేస్తోందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ కామెడీ షో చిత్రీకరణకు అయ్యే ఖర్చు కంటే శ్రీదేవి డ్రామా కంపెనీ చిత్రీకరణకు ఖర్చు ఎక్కువగా ఉండవచ్చునని కొందరి అభిప్రాయం.
కానీ ఈ రెండింటికీ మధ్య ఖర్చు విషయంలో పెద్ద తేడా ఏమీ లేదని మల్లెమాల ప్రొడక్షన్ ద్వారా తెలుస్తోంది. జబర్దస్త్ షో లో జడ్జిలకు యాంకర్లకు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ ఉంటుంది.శ్రీదేవి డ్రామా కంపెనీ లో హాజరయ్యే ప్రతి ఒక్కరికి రెమ్యునరేషన్ ఇవ్వరు. ఎందుకంటే ఈ షోలో పాల్గొనడానికి వచ్చే అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఈటీవీలో కనిపించాలనీ ఒక ఆసక్తితో ఎటువంటి పారితోషికం తీసుకోకుండా పని చేస్తారని సమాచారం. అందువల్ల ఈ రెండు షో లు చిత్రీకరణకు పెద్ద తేడా ఉండదు అని అంటున్నారు.