Aiswarya Dhanush : టాలీవుడ్ మోస్ట్ లవ్ ఇన్ కపుల్ సమంత నాగ చైతన్య విడాకులు ఇండస్ట్రీ లో ఎంత కలకలం సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల వీరి బాటలోనే కోలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రజనీకాంత్ – ధనుష్ కూడా విడాకులు తీసుకొని వారి 18 సంవత్సరాల వివాహబంధానికి ముగింపు పలికారు. భవిష్యత్తు కొరకు ఇద్దరూ ఒకరికొకరు మాట్లాడుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.18 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట ఒక్కసారిగా ఇలా విడాకులు తీసుకోవటంతో అభిమానులు షాక్ అయ్యారు.
విడాకుల తర్వాత ధనుష్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు. ఐశ్వర్య రజనీకాంత్ కూడా అనంతరం మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. ధనుష్ నటించిన “3” , ” విఐపి-2 “సినిమాలకు దర్శకత్వం వహించిన ఐశ్వర్య దర్శకురాలిగా తన సత్తా నిరూపించుకుంది. ఎంతోకాలం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్న ఐశ్వర్య తమిళ స్టార్ హీరో శింబు ని డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. విడాకుల తరువాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

కానీ విడాకుల తర్వాత ఐశ్వర్య గురించి ధనుష్ మొదటిసారిగా స్పందించాడు. ఇటీవల ఐశ్వర్య డైరెక్ట్ చేసిన పయని అను మ్యూజిక్ వీడియో విడుదల చేశారు. ఈ మ్యూజిక్ వీడియోలు తమిళ వర్షన్ లో రజనీకాంత్, తెలుగు వెర్షన్ లో అల్లు అర్జున్, మలయాళ వెర్షన్ మోహన్ లాల్ విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ మ్యూజిక్ వీడియో గురించి ధనుష్ స్పందిస్తూ ” పయని మ్యూజిక్ వీడియో ని డైరెక్ట్ చేసిన నా స్నేహితురాలు ఐశ్వర్య కు అభినందనలు.. గాడ్ బ్లెస్ యు ” అని పోస్ట్ చేశాడు. ధనుష్ చేసిన పోస్ట్ కి ఐశ్వర్య స్పందిస్తూ ధనుష్ కి థాంక్స్ చెప్పింది. ఇందుకు సంబంధిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా వీరిద్దరూ మళ్లీ ఇలా మాట్లాడుకోవడం తో ధనుష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Aiswarya -Dhanush: విడాకుల అనంతరం మొదటిసారి ఐశ్వర్య గురించి పోస్ట్ చేసిన ధనుష్.. ఆనందంలో అభిమానులు..!