Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ సీజన్- 5 గేమ్ షో చాలా ఆసక్తిగా సాగుతోంది. ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ గేమ్ షోకు మరో నాలుగు వారాల్లో ఎండ్ కార్డ్ పడునుంది. సీజన్-5లో 19 మంది సభ్యులు హౌస్‌లోకి అడుగుపెడితే ప్రస్తుతం 8 మంది మాత్రమే మిలిగారు. సభ్యులంతా తమకు నచ్చినట్టు గేమ్ ఆడుతున్నారు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేస్తున్నారు. మానస్ ఈ వారం కెప్టెన్సీ హోదాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం కొంచెం సంక్లిష్టంగా మారింది.
ఇకపోతే బుల్లితెర యాంకర్‌గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ‘రవి’బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక అతని పేరు కొంత మసక బారినట్టు తెలుస్తోంది. అందుకు కారణం బిగ్ బాస్ రవికి ఇచ్చిన టాస్కులే అని చెప్పవచ్చు. నారదుని క్యారెక్టర్ అంటే అందరికీ తెలుసు. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్పి సభ్యుల మధ్య గొడవలు వచ్చేలా చేయడమే యాంకర్ రవి పని. అయితే, అతను చేసే పనుల వలన బిగ్ బాస్ సభ్యుల్లో నటరాజ్ మాస్టర్ రవికి ‘గుంటనక్క’అని పేరు పెడితే.. సన్నీ మాత్రం ‘నారదుడు’ అని పేరుపెట్టాడు.
రవి తనకు ఇచ్చిన టాస్కులను ఫర్‌ఫెక్ట్‌గా చేస్తున్నాడు కాబట్టే ఇన్ని ఎలిమినేషన్స్ దాటుకుని టాప్ 8లోకి అడుగుపెట్టాడు. ఇటీవల హోస్ట్ నాగార్జున కూడా ఒకానొక సందర్భంలో యాంకర్ రవిని విమర్శించాడు. దీంతో యాంకర్‌గా ఇన్ని రోజులు సంపాదించుకున్న మంచి పేరు మసకబారినట్టు తెలుస్తోంది. కొందరు నెటిజన్లు యాంకర్ రవికి వచ్చిన ‘నారదుడు, గుంటనక్క’ పేర్లను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రవి భార్య నిత్య సన్నిహితుల వద్ద చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసిందట.. తన కూతురిని కూడా ఆకారణంగా ట్రోల్స్ చేస్తున్నారని తెగ బాధపడినట్టు తెలుస్తోంది.
Read Also : Bigg Boss 5 Telugu : ఎన్టీఆరే బెస్ట్.. నాగార్జున తీరుపై మాధవీలత ఫైర్..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world