...

Brahmanandam : వారివల్లే తనకు ఇంకా క్రేజ్ ఉందంటున్న బ్రహ్మానందం.. వారు ఎవరంటే..?

Brahmanandam : తెలుగు తెర మీద వెలిగిన కమెడియన్లు చాలా మందే ఉన్నారు. కానీ వారి ఎవరి గురించి తెలియనంతగా ప్రేక్షకులకు బ్రహ్మానందం గురించి తెలుసు. అతడు ఉన్నాడంటే ఆ సినిమాకు క్రేజే వేరేలా ఉండేది. అసలు మూవీ హీరో హీరోయిన్ ఎవరనేది పట్టించుకోకుండా కేవలం ఆ సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడు కాబట్టే సినిమా హిట్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మీ గొప్పలకు లెక్కలేదు. అతడు ఇప్పటికే దాదాపు వేయికి పైగా సినిమాల్లో మెరిశాడు. అతడి ప్రతిభను గుర్తించిన గిన్నిస్ బుక్ కూడా అతడి పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎంటర్ చేసింది. టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన వ్యక్తిగా బ్రహ్మానందం నిలిచాడు.

కానీ ఇటువంటి బ్రహ్మానందం ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ ఆయన మాత్రం ఓ విషయంలో మనల్ని ఎప్పుడూ నవ్విస్తూనే ఉన్నారు. అవే మీమ్స్. మనం ఎన్ని రకాల మీమ్స్ తీసుకున్నా కానీ వాటిల్లో ఎక్కువగా బ్రహ్మనందం ఫొటోలే మనకు దర్శనమిస్తాయి. అంతలా మీమర్స్ ఆయన్ను హైలెట్ చేశారు. హస్య బ్రహ్మ బ్రహ్మానందం తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మి మాట్లాడుతూ.. మీమర్స్ కు థ్యాంక్స్ చెప్పాడు. కేవలం మీమర్స్ వల్లే తాను ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఉన్నానని అన్నాడు.

మీమర్స్ కనుక లేకపోతే తనను ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయేవారని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బ్రహ్మానందం ప్రస్తుతం పంచతంత్ర కథలు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బ్రహ్మానందమే లీడ్ రోల్ పోషించడం విశేషం. మళ్లీ పాత బ్రహ్మీని చూడాలని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి తెలుగు ప్రేక్షకుల కోరిక ఎప్పుడో నెరవేరుతుందో. మళ్లీ బ్రహ్మీ కామెడీని మనం ఎప్పుడు చూస్తామో.

Read Also : Bigg Boss 5 Telugu : యాంకర్ రవిని కావాలని టార్గెట్ చేస్తున్నారట.. భార్య ఆవేదన..!