Arjun srisatya: బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరిని లైన్ లో పెట్టే పనిలో ఉన్నట్టే కనిపిస్తున్నాడు కంటెండర్ అర్జున్ కల్యాణ్. ముఖ్యంగా శ్రీసత్యను లక్ష్యంగా చేసుకొని ఆమెను ముగ్గులో దించేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు. అయితే దాని కోసం గేమ్ కూడా పక్కన పెట్టి ఆమె సేవల్లో తరిస్తున్నాడు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ అర్జున్ పై చేస్తున్న ఏకైక కంప్లైంట్ అదే. శ్రీసత్య కోసం గేమ్ కూడా ఆడటం లేదని అందరూ ఓట్లు వేసి జైలుకి పంపారు.
అయినా అర్జున్ కల్యాణ్ తీరులో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. తాజాగా బిగ్ బాస్ అచ్చిన టాస్క్ లో కూడా శ్రీసత్యకు ఫేవర్ చేయడానికి ట్రై చేశాడు. ప్రస్తుతం హౌస్ లో బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ జరుగుతోంది. ఒకరి ఎమోషన్లు హౌస్ లో ఉన్న అందరు కంటెస్టెంట్లతో బిగ్ బాస్ ముడి పెట్టాడు. బ్యాటరీ రీఛార్జ్ చేసుకుంటే కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం, లేదా వాళ్లు పంపే సందేశాలు వినొచ్చు.
అయితే బ్యాటరీ 80 శాతం ఉండగా.. 35 శాతం కోల్పోయే వీడియో కాల్ ఆప్షన్ ను అర్జున్ ఎంచుకున్నాడు. కానీ అది అతని కోసం కాదు. ఆ అవకాశాన్ని శ్రీసత్యకు ఇవ్వాలని బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేశాడు. ఆమె తన అమ్మ గురించి బాగా దిగులు పడుతోందని అందుకే ఇలా చేశానంటూ కవర్ చేశాడు.