...

Viral news: పెళ్లైన 35 రోజులకే భర్తను కడతేర్చింది.. పక్కా ప్లాన్ తో చంపేసింది

Viral news: భర్తలను చంపుతున్న భార్యలు. ఈ మధ్య తరచూ వింటున్న వార్తలు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువై పోయాయి. వివాహం చేసుకుని నెల రోజులు కూడా గడవక ముందే కడతేరుస్తున్నారు. ఇలాంటి చాలా ఘటనల్లో కనిపించేవి అందరికీ తెలిసిన కారణాలే. పెళ్లికి ముందు ఎవరితోనో తిరగడం.. పెద్దలు ఏమంటారోనన్న భయంతో వారికి చెప్పకుండా ఉండటం.. చివరికి ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భర్తను చంపడం.. ఇలాంటి ఘటనలు చాలా కనిపిస్తున్నాయి.

ప్రియుడి గురించి పెద్దలకు చెప్పేందుకు లేని ధైర్యం.. భర్తలను చంపడంలో చూపిస్తున్నారు. కొన్ని ఘటనల్లో అయితే… తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయడం అమాయకపు భర్తల ప్రాణాలను తీస్తోంది. తాజాగా సిద్దిపేటలో ఓ భార్య పెళ్లైన 35 రోజులు కూడా గడవక ముందే భర్తను అంతమొందించింది.

సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులకు చెందిన శ్యామలకు దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ కు మార్చి 23న పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే శ్యామల వేరే వ్యక్తితో అఫైర్ నడిపించింది. తర్వాత చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకుంది. భర్తతో తనకు సుఖం లేదని, భర్తను అడ్డు తొలగిస్తే మనం సంతోషంగా ఉండొచ్చని ప్రియుడిని ఉసిగొల్పింది.

ప్రియుడితో కలిసి మొదట ప్లాన్ ప్రకారం ఆహారంలో పురుగులమందు వేసి తినిపించింది. కానీ మొదటి ప్రయత్నంలో భర్త చనిపోలేదు. ఇలా అయితే కాదని భావించిన శ్యామల… మరొక ప్లాన్ వేసింది. సరస్వతీ ఆలయంలో మొక్కు ఉందని చెప్పిన భర్తను బైక్ పై తీసుకెళ్లింది. అంతకుముందే అక్కడ కాపు కాసిన శ్యామల ప్రియుడి, అతని మిత్రులు చంద్రశేఖర్ పై దాడి చేశారు. తువాలుతో మెడ చుట్టూ ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.