Crime News: ప్రస్తుత కాలంలో చాలామంది మహిళలు కామాంధుల కామ వాంఛలకు బలైపోతున్నారు. చిన్నపిల్లలు ముసలివారు అని కూడా కనికరం చూపకుండా కంటికి కనిపించిన వారి మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంతటి కఠినమైన శిక్షలు విధించినా కూడా వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటీవల జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయిదేళ్ల బాలిక మీద జరిగిన అత్యాచార ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే..త్రిపురలోని ధలై జిల్లాలోని గండచెర్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 5 సంవత్సరాల వయసున్న బాలిక మంగళవారం రాత్రి మతపరమైన కార్యక్రమాల కోసం తన తల్లితో కలిసి వచ్చింది. అప్పటికే హత్య కేసులో నిందితుడిగా కఠిన కారాగార శిక్ష అనుభవించిన వ్యక్తి చిన్నారిని సమీపంలోని అడవిలోనికి ఎత్తుకెళ్లి చిన్నారి మీద అత్యాచారానికి ఒడిగట్టాడు.బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే బాలికను రక్షించిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సదరు నిందితుడు హత్య కేసులో శిక్ష అనుభవించి గత శనివారం జైలు నుండి విడుదల అయినట్లు సమాచారం.
అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గండచెర్రా-అమర్‌పూర్ హైవేను దిగ్బంధించి స్థానికులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లో బుధవారం తెల్లవారుజామున సమీపంలోని గ్రామంలో పట్టుబడిన నిందితుదీని మహిళను చెట్టుకు కట్టేశారు. సదరు నిందితుడి మీద మహిళలు విచక్షణ రహితంగా దాడి చేయటం వల్ల ఘటనా స్థలంలో అతను స్పృహ కోల్పోయాడు. ఈ క్రమంలో లో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సరైన న్యాయం అంటు కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World