Vanama Raghava : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్.. రోజుకో మలుపు తిరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వీరు ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందుకు కారణం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేందర్‌రావు అంటూ ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ కేసులు రాఘవేందర్ రావు ఏ2గా ఉన్నాడు.
తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్ లో రాశాడు రామకృష్ణ. దీనితో పాటు ఓ వీడియోను సైతం రికార్డు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు తాజాగా వనమా రాఘవను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రామకృష్ణ ఫ్యామిలీతో సూసైడ్ చేసుకోబోయే ముందు మాట్లాడిన రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Vanama Raghava : సంచలన విషయాలు బయటకు..
మొదటి వీడియో ఇప్పటికే బయటకు రాగా తాజాగా రెండో వీడియో సైతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రామకృష్ణ సంచలన విషయాలు వెల్లడించారు. తాము సూసైడ్ చేసుకోవడానికి సూత్రధారి వనమా రాఘవేందర్ రావు అంటూ చెప్పుకొచ్చాడు. 20 ఏళ్లుగా తన అక్కతో రాఘవేందర్ రావుకు వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపణలు చేశాడు రామకృష్ణ. తన తండ్రి ద్వారా తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపాడు.
సంవత్సరం నుంచి తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని వాపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. ఈ కేసులో రాఘవేందర్ రావును అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. భద్రాద్రిజిల్లాలో దమ్మపేట మండలం మందలపల్లి సమీపంలో రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసును మరింత ముందుకు తీసుకెళ్తే చాన్స్ ఉంది.
Read Also : murder : మైనర్ లవ్.. ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు.. కరీంనగర్ గుట్టల్లో కుళ్లిన మృతదేహం లభ్యం!