...

దీప్తి సునయన పోస్ట్ వైరల్.. నేను పులిని అంటూ డైలాగ్..

దీప్తి సునయన.. ఈ పేరు ప్రస్తుతం చాలా పాపులర్ అయింది. బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముక్ తో లవ్ ట్రాక్ నడిపిన అమ్మడు ఇటీవలే బ్రేకప్ అవుతున్నట్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. సీజన్ టైటిల్ సొంతం చేసుకునేందుకు షణ్ముక్ ముందు నుంచి బాగానే ట్రై చేశాడు. అందుకు అనుగుణంగా నెమ్మదిగా డీల్ చేస్తూ మంచి ప్లాన్ తో ముందుకు కొనసాగాడు. కానీ సిరితో క్లోజ్ అయ్యాక అతనిపై నెగెటివ్ ప్రభావం పడింది. ముందుకు నుంచి షణ్ముక్‌కు సపోర్ట్ చేసిన దీప్తి.. తర్వాత ఆయనకు ఎక్కువగా ఓటింగ్ వచ్చేందుకు బాగా కష్టపడింది. అతనిపై రూమర్స్ వస్తున్నా.. వాటిని పక్కన పెట్టి షణ్ముక్‌ను ఎంకరేజ్ చేసింది. కానీ షణ్ముక్, సిరి మధ్య బిగ్ బాస్ హౌస్‌లో కొత్త బంధం ఏర్పడినట్టయింది. చాన్స్ దొరికినప్పుడల్లా.. హగ్గులు, కిస్సులతో రెచ్చిపోయారు. చివరి వరకు సైతం సిరి షణ్ముక్ తో అలానే బిహేవ్ చేసింది.

Deepthi Shanmukh Breakup : Deepthi Sunaina Gives Clarity on Breakup with Shanmukh after Bigg Boss 5 Telugu

కానీ సిరి వ్యవహారం మొదలయ్యాక నెమ్మదిగా అతడు వెనకబడుతూ వచ్చాడు షణ్ముక్. కానీ తన బాయ్ ఫ్రెండ్, పేరెంట్స్ చెప్పిన విషయాన్ని సైతం సిరి పక్కన పెట్టి షణ్ముక్‌తో ముందులాగే హద్దులు దాటుతూ ప్రవర్తించింది. దీంతో ఆడియన్స్‌కు సైతం విసుగు పుట్టి. షణ్ముక్ పక్కనపెట్టడం ప్రారంభించారు. చివరి నిముషంలో అనూహ్యంగా సన్నీ టైటిల్ సొంతం చేసుకోగా.. షణ్ముక్ రన్నరప్ గా నిలిచాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముక్, దీప్తి సునయన కలుసుకోలేదు. ఈ క్రమంలో తాను బ్రేకప్ అవుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ తర్వాత సిరి విషయంలోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. ఇక వీటి నుంచి ఫ్రెష్ అవుతున్న దీప్తి.. తాజాగా ఓ పోస్ట్ చేసింది. నేను పులిని.. మా డాడ్ నన్ను అలా పెంచారు అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.