...

Woman Murder : కోడలిపై కన్నేసిన మామ.. ఒంటరిగా ఉన్న సమయంలో..!

Woman Murder : కోడలంటే కూతురితో సమానం.. కానీ కామం తలకెక్కిన మామ.. తన సొంత కోడలి పైనే కన్నేశాడు. మూడు సంవత్సరాలుగా వెంట పడుతూ.. ఆమె లొంగకపోవడంతో అతి కిరాతకంగా చంపేశాడు. ఈ సంఘటన కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామ శివారు సోమ్లా తండా లో బుధవారం చోటుచేసుకుంది. సోమ్లా తండా కు చెందిన భూక్య హచ్యనాయక్ కు ముగ్గురు కుమారులు.

రెండో కుమారుడైన సంతోష్ కు కురవి మండలంలోని మోదుగుల గూడెం శివారు జుజుర్ తండాకు చెందిన రజితతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు.సంతోష్ భార్య రజిత పై మామ హచ్యనాయక్ కొంతకాలంగా కన్నేశాడు. లొంగదీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఎంతకీ రజిత లొంగక పోగా.. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పగా వారు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. దీంతో కోడలి పై హచ్యనాయక్ పగ పెంచుకున్నాడు.

ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా పొలం పనులకు వెళ్లాక ఇంట్లో ఉన్న కోడలి పై అత్యాచారం చేయబోయాడు.రజిత ఎదురు తిరగడంతో రాడుతో రజిత తలపై కొట్టాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. కింద పడిపోయిన ఆమె గొంతును కత్తితో కోశాడు. విచక్షణరహితంగా 20 సార్లు కత్తితో పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్యానంతరం హచ్యనాయక్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు సోమ్లా తండా కు వెళ్లి హచ్యనాయక్ ఇంటి పై రాళ్లతో దాడి చేశారు. గడ్డివామును దహనం చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

హచ్యనాయక్ ను తమకు అప్పగించే వరకు రజిత మృతదేహాన్ని ఇక్కడినుంచి తీసుకుపోబోమని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బంధువులకు నచ్చజెప్పిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రజిత తండ్రి బోడ చంద్రు ఫిర్యాదు మేరకు హచ్యనాయక్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Read Also : murder : మైనర్ లవ్.. ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు.. కరీంనగర్ గుట్టల్లో కుళ్లిన మృతదేహం లభ్యం!