...

Man murder: మటన్ కోసం భార్యాభర్తల మధ్య గొడవ.. ఆపేందుకు వెళ్లిన వ్యక్తిని చంపేశారు..!

Man murder: మాంసాహారం అంటే చాలా మందికి ఇష్టమే. కొందరు అన్ని రోజుల్లో నాన్ వెజ్ తింటుంటారు. మరికొందరేమో వారంలోని కొన్ని రోజుల్లో తినరు. అలాంటి సమయాల్లో చాలా మంది మగవాళ్లు బయటే తినేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్య మాంసాహారం తినని, వండని రోజు మటన్ తీసుకొచ్చాడు. ఈరోజు ఇంటికి ఎలా తీసుకొస్తావంటూ భార్య ప్రశ్నించగా.. వారిద్దరి మధ్య గొడవ జరిగింది.

భార్యాభర్తలు ఒకరినొకరు కొట్టుకుంటుండగా.. పక్కింటి వ్యక్తి వచ్చి గొడప ఆపాలని చూశాడు. కానీ అదే అతని పాలిట శాపం అయింది. మధ్య ప్రదేశ్ రాజధానిలో ఈ ఘటన వెలుగు చూసింది. భోపాల్ లో పప్పు అర్హ్ వార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే తనకు ఇష్టం అయిన మటన్ తీసుకొచ్చాడు. ఆరోజు మంగళవారం కావడంతో భార్య వండేందుకు నిరాకరించింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. వారి గొడవ ఆపేందుకు పక్కింటి వ్యక్తి వెళ్లాడు.

దీంతో కోపోద్రిక్తుడైన పప్పు.. బిల్లును కర్రతో చావబాదాడు. బబ్లూకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇరుగుపొరుగు వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ అతను మృతి చెందాడు.