Drugs Case : విశాఖపట్నంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపాయి. నగరంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక యువతిని, మరోక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో యువతిది హైదరాబాద్ కాగా… యువకుడిది విశాఖపట్నం మర్రిపాలెంలోని గ్రీన్ గార్డెన్ నివాసిగా గుర్తించారు.
ప్రేమ గుడ్డిదని పలువురు అంటుంటే విని ఉంటాం. ప్రేమ మైకంలో తప్పని తెలిసినా కొందరు చెడు దారులు తొక్కుతూ… వారి అందమైన జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అంతేకాకుండా వారిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ఈ జంటను చూస్తుంటే ఈ మాటలే నిజం అనిపిస్తున్నాయి. డ్రగ్స్ కు ప్రియుడు అలవాటుపడ్డంతో ప్రియుడి కోసం హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చేందుకు సదరు యువతి ప్రయత్నించింది. హైదరాబాద్ నుంచి వస్తున్న యువతి దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు టాస్క్ ఫోర్స్ కు పక్కా సమాచారం అందింది.
దీంతో విశాఖలో సదరు యువతిని టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేయగా.. లవర్ కోసం మత్తుపదార్ధాలు యువతి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ను టాబ్లెట్ రూపంలో ఉన్న 18 పిల్స్, 2ఎండీఏంఏలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసుల మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసు స్టేషన్ కు తరలించినట్లు.. ఎసీపీ శ్రీపాదరావు, సీఐ ఉమాకాంత్ తెలిపారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World