Car accident: మనకు ఏ విషయం తెలియక పోయినా గూగుల్ తల్లిని ఆశ్రయించడం అలవాటు అయిపోయింది. గూగుల్ కు వెళ్లడం అందులోకి మనకు కావాల్సిన దాని గురించి సెర్చ్ చేయడం ఇప్పుడు చాలా మామూలు విషయం. అలాగే ఎక్కడికై తెలియని ప్రదేశాలకు వెళ్లాలన్నా ఎక్కువ మంది గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తారు. అయితే ఈ జీపీఎస్ ఒక్కోసారి మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఏ దారీ లేని చోటుకు తీసుకు వెళ్తుంది.
మనకు వెళ్లాల్సిన ప్రదేశానికి, అధి తీసుకువెళ్లే ప్రాంతానికి ఎలాంటి పోలికా ఉండదు. అందుకే గుడ్డిగా గూగుల్ మ్యాప్స్ ను నమ్మొద్దు అని కొందరు సేటైరికల్ గా అంటారు. తాజాగా అమెరికాలో ఓ కారు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లపైకి దూసుకెళ్లింది. ఆ కారులో ఓ యువతిని గుర్తించారు అధికారులు. ఆ యువతి కారు నడుపుకుంటా పోలీస్ డిపార్ట్ మెంట్ గ్యారేజీ లోకి వచ్చింది. అలాగే కారును స్టేషన్ మెట్లపైకి ఎక్కించింది.
ఆ కారు అక్కడే ఆగిపోయింది.. ఈ సంఘటనపై ఆ కారును డ్రైవ్ చేస్తున్న యువతిని ప్రశ్నించిన పోలీసులకు ఆమె నుండి వింత సమాధానం ఎదురైంది. తాను జీపీఎస్ ను చూస్తూ కారు నడిపానని, అది చూపించిన మార్గంలోనే వెళ్తుండగా ఇలా మెట్లపైకి తీసుకువచ్చిందని ఆ యువతి పోలీసులకు చెప్పింది. ఆ యువతి సమాధానం విన్న పోలీసులు కాస్తంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ యువతికి డ్రంకన్ డ్రైవ్ టెస్టు నిర్వహించగా మద్యం సేవించినట్లు తేలింది. దాంతో ఆమెకు పోలీసులు సమన్లు జారీ చేశారు.