...

AP CM Jagan : ఏలూరు అగ్నిప్రమాద బాధితులకు 25 లక్షల నష్ట పరిహారం..!

AP CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు పోరస్ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగి ఆరుగురు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు.. ఒక్కో ఇంటికి గాను రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించారు.

అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల చొప్పున.. స్వల్పంగా గాయపడిని వారికి 2 లక్షల చొప్పున ఇవ్వబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది, కారణం ఏంటనే విషయాలను తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

AP CM Jagan
AP CM Jagan

ఏలూరు జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి రియాక్టర్​ పేలడంతో… అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. అలాగే మరో 012 మందికి తీవ్రగాయాలయ్యాయి.

Read Also : Extend age limit for police: యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయో పరిమితి పెంపు..!