Attack on traffic police: కారు ఆపాడన్న ఆవేశంలో ట్రాఫిక్ పోలీసుపైనే దాడి చేశాడు ఓ కారు డ్రైవర్. కోపంలో పోలీసు అని కూడా చూడకుండా మీద పడి కొట్టాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వీధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కారు డ్రైవర్ విరుచుకుపడ్డాడు. అతి వేగంగా వెళ్తున్న కారణంగా కారు ని ఆపేందుకు ప్రయత్నించగా ఆగ్రహం తో ఆ కారు డ్రైవర్ నా కారునే ఆపుతావా అంటూ రెచ్చిపోయాడు. కానిస్టేబుల్ పై చేయి చేసుకుంటూ.. పిడి గుద్దులు గుద్దాడు. ఇక కారు డ్రైవర్ ది భీమవరం ప్రాంతంలోని గూనుపూడిగా గుర్తించారు పోలీసులు. గతంలో కూడా ఇలానే ఒక యువకుడు సైకిల్ కి అడ్డుగా వచ్చాడని కానిస్టేబుల్ ని తరిమి తరిమి కొట్టాడు. కర్ర తీసుకొని కానిస్టేబుల్ ఆపమని చెప్పినా ఆపకుండా వెంటబడి మరీ కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అలాగే మరో గా యువకుడు తన బండి ని ఆపినందుకు ట్రాఫిక్ పోలీస్ పై చేయి చేసుకున్నాడు.
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ దృశ్యాలు. కారు ఆపారన్న కోపంతో విధుల్లో ఉన్న పోలీసులపై రెచ్చిపోతున్నారు కొందరు. ట్రాఫిక్ కానిస్టేబుల్ అనే భయం కూడా లేకుండా అతడిపైనే దాడి చేశాడు. ఇక పోలీసులు ఈ వీడియో చూసి అతని పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.