Viral video: ధూమ్ సినిమాలో హీరోలా చోరీ చేయాలనుకున్నాడు.. కానీ దొరికిపోయి!

Viral video: మొన్న కదులుతున్న రైలులోంచి ఓ వ్యక్తి దొంగతనం వీడియో చూసి ఇన్ స్పైర్ అయ్యాడో లేక ధూమ్ సినిమా హీరోను చూసి ఇన్ స్పైర్ అయ్యాడో తెలియదు కానీ.. కదులుతున్న రైల్లో ఉన్న ప్రయాణికుడి నుంచి ఫోన్ కొట్టేయబోయాడో వ్యక్తి. అయితే ఇతడు ఫోన్ కొట్టేయడం ఏమో కానీ ప్రయాణికుడు మాత్రం కిటీకీలోంచి ఇతని చేతులను లాగి పట్టుసేకున్నాడు. ఎంత వదలమని వేడుకున్న వదలకుండా నెక్స్ట్ స్టేషన్ వచ్చే వరకు అలాగే పట్టుకున్నారు. ఓ వైపు నొప్పితో విలవిల్లాడుతూనే మరోవైపు వదలమంటూ బతిమాలాడు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఈ ఘటన సెప్టెంబర్ 14వ తేదీన బిహీర్ లో చోటు చేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్ ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు సాహెబ్ పూర్ కమల్ స్టేషన్ వద్దకు రాగానే దొంగ మొబైల్ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. అక్కడే అతని ప్లాన్ బెడిసి కొట్టింది. మొబైల్ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్ దొంగ చేతులను కిటికీలోంచి గట్టిగా పట్టుకున్నాడు. రైలు ప్రారంభం అవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ.. చేతులు వదిలేయమని వేడుకున్నాడు. అప్పటికే రైలు వేగం పెరగడంతో 15 కిలో మీటల్ల అలాగే ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement