...

Crime News: కర్నూలు లో ఏఎస్ఐ నిర్వాకం.. హంతకులను శిక్షించకుండా వారితో కలిసి ..!

Crime News: పోలీసులంటే ప్రజలకు అన్ని వేళలా అండగా ఉండి వారిని రక్షించాలి. కానీ ప్రస్తుత కాలంలో కొందరు పోలీసుల నిర్వాకం వల్ల పోలీస్ వ్యవస్థకే కళంకము వస్తోంది. ప్రజలను రక్షించి, నేరస్తులను శిక్షించాలని పోలీసులు నేరస్తులకు సాయం చేస్తూ వారి విలువను కోల్పోతున్నారు. ఇటీవల కర్నూలు లో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం. కర్నూల్ జిల్లాలో జరిగిన సంఘటన మొత్తం పోలీస్ వ్యవస్థ లో తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే..కర్నూలు జిల్లా అవుకు పట్టణంలో హత్యకు గురైన సుమలత కేసులో ఏఎస్ఐ బాబా ఫక్రుద్దీన్ నిందితులకు సహాయం చేయటమే కాకుండా
తన పోలీస్ మెదడు ఉపయోగించి ఆధారాలు దొరకకుండా హత్య చేయడానికి నింతులకు సలహాలు ఇచ్చాడు.దీంతో హత్యకు పాల్పడిన నిందితులు బొడ్డు సుజాత, వసంత, రామకృష్ణ తో పాటు ఏఎస్ఐ బాబా ఫక్రుద్దీన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బాబా ఫక్రుద్దీన్ పరారీలో ఉన్నాడు.

సుమలత, సుజాత మధ్య డబ్బు విషయంలో వివాదాలు ఏర్పడటం వల్ల సుజాత ను హత్య చేయాలని నిర్ణయించుకుంది. సుమలత తనతో పాటు వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని కోపం పెంచుకున్న బాబా ఫక్రుద్దీన్ ప్రతీకారం తీర్చుకోవాలని సుజాతకు సహాయం చేశాడు. నిందితులను విచారించే సమయంలో హత్యలో ఏఎస్ఐ పాత్ర కూడా ఉందని నిర్ధారించారు. బాబా ఫక్రుద్దీన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.