...

Anantapur Murder : భార్యకు ఉరేశాడు.. పసిబిడ్డ గొంతునులిమేశాడు.. పోలీసులనే కన్నీళ్లు పెట్టించింది..!

Anantapur Murder : అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాపిల్లలన్నీ అత్యంత కిరాకాతకంగా హత్యచేశాడో వ్యక్తి. ముందుగా భార్యకు ఊరేశాడు. ఆ తర్వాత మూడేళ్ల పసికందు అని చూడకుండా గొంతునులిమి హత్య చేశాడు. బయటకు వచ్చి తన భార్యే బిడ్డను చంపేసి ఉరేసుకుందంటూ చుట్టుపక్కల వారిని నమ్మించాడు. అతడి మాటలు నమ్మినవారంతా అయ్యో పాపమని విచారం వ్యక్తం చేశారు. విగతజీవిగా పడిఉన్న పసికందును చూసి పోలీసులు సైతం చలించిపోయారు.

భార్యా బిడ్డను చంపేసి ఏమి తెలియనట్టు దొంగ ఏడుపుతో ఊరంతా తిరుగుతూ అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, పోలీసులు మొదట అతడు చెప్పిందే నిజమనుకున్నారు. కానీ, అతడి ప్రవర్తనలో ఏదో తేడా అనిపించి అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని తమైదన శైలిలో విచారించగా.. అసలు నిజాన్ని బయటపెట్టాడు. తానే భార్యను చంపి ఆపై మూడేళ్ కూతురిని గొంతునులిమి చంపినట్టు అంగీకరించాడు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు శివారులో వివాహిత అనుమానాస్పదంగా ఉరేసుకుంది.

మూడు నెలల పసికందు కూడా మరణించడంతో స్థానికులు చలించిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు కూడా తల్లిబిడ్డను చూసి ఒక్కసారిగా చలించిపోయారు. దీనిపై బంధువులను పోలీసులు విచారించగా పసికందును చంపి తల్లి ఉరేసుకుందని చెప్పారు బంధువులు. కానీ, నిందుతుడి ప్రవర్తనలో తేడాను గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంతో అసలు నిజాన్ని కక్కేశాడు. భార్యతో పాటు పసికందను భర్తే గొంతునులిమి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Read Also : KGF 2 Movie Release Date : కేజీఎఫ్ 2 ఫ్యాన్స్‌కు పండగే.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఆ తేదీనే పక్కా రిలీజ్..!