RRR Review : తెలుగులో పెద్ద హీరోల మల్టీ స్టారర్ సినిమాలు వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఎట్టకేలకు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోలుగా గుర్తింపు ఉన్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల కలయికలో సినిమా.. అది కూడా జక్కన్న దర్శకత్వంలో 500 కోట్ల బడ్జెట్ తో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించి ఉంటాడు అనడంలో సందేహం అస్సలు అక్కర్లేదు. కనుక ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చర్చిద్దాం.
కథ :
తెలంగాణ ప్రాంతంకు చెందిన గోండు జాతి కాపరి కొమురం భీమ్(ఎన్టీఆర్) కాగా బ్రిటీష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారి అల్లూరి సీతరామరాజు(రామ్ చరణ్). కొన్ని కారణాల వల్ల కొమురం భీమ్ ను పట్టుకునే బాధ్యతను బ్రిటీష్ ప్రభుత్వం రామరాజుకు అప్పగిస్తుంది. ఇద్దరి మద్య వైరం కాస్త స్నేహం గా మారుతుంది. కొమురం భీమ్ ను వదిలేసినందుకు సీతరామ రాజుకు శిక్ష పడుతుంది. తన వల్ల శిక్ష పడ్డ సీతరామరాజును కాపాడేందుకు కొమురం భీమ్ రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బ్రిటీష్ వారిపై పోరు మొదలు పెడతారు. ఇద్దరి స్నేహం ఎలా కుదిరింది? అందుకు దోహదం చేసిన అంశాలు ఏంటీ? చివరికి బ్రిటీష్ వారిపై ఆ ఇద్దరి యుద్దం ఎక్కడకు దారి తీసింది అనేది సినిమా కథ.
నటీనటులు :
యాక్టింగ్ విషయం లో ఎన్టీఆర్ (Jr NTR) ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఏ పాత్రను అయినా అద్బుతంగా పోషించగల సత్తా ఉన్న స్టార్. ఇక రామ్ చరణ్ (Ram Charan) కూడా మెగాస్టార్ వారసుడిగా మంచి నటన ప్రతిభ ఉన్నవాడే. వీరిద్దరితో జక్కన్న తనకు కావాల్సిన ఔట్ పుట్ ను కాస్త ఎక్కువ టేక్ లు అయినా.. రీటేక్ లు అయినా కూడా రాబట్టినట్లుగా అనిపించింది. ప్రతి సన్నివేశంలో కూడా చిన్న చిన్న డిటైల్స్ కూడా మిస్ కాకుండా ఇద్దరు హీరోలు సూపర్ పర్ఫెక్ట్ గా చేశారు.
ఇద్దరు హీరోల నటన పతాక స్థాయిలో ఉంది. ఎంట్రీ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ లో ఇదర్దు హీరోల నటన పీక్స్… వారి కెరీర్ బెస్ట్ అనుకోవచ్చు. ఆలియా భట్ ఇప్పటికే తన హిందీ సినిమాలతో సత్తా నిరూపించుకుంది. ఈ సినిమాలో కూడా సీత పాత్రకు నూరు శాతం న్యాయం చేసింది. కాని ఆమెకు స్క్రీన్ ప్రజెన్స్ చాలా తక్కువ ఉండటం బాధకరం. అజయ్ దేవగన్ మరియు ఇతర పాత్రల్లో నటించిన నటీ నటులు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.
టెక్నికల్ :
దర్శకుడిగా రాజమౌళి హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని వాడగల సత్తా ఉన్న టెక్నీషియన్. ఆయన తన దర్శకత్వం.. స్క్రీన్ ప్లే విషయాలపైనే కాకుండా అన్ని క్రాఫ్ట్ లపై పట్టు ఉన్నట్లుగా వ్యవహరించాడు. ప్రతి ఒక్క విభాగం లో తాను పని చేసినట్లుగా ఆయా టెక్నీషియన్స్ తో ది బెస్ట్ ఔట్ పుట్ రాబట్టుకున్నాడు. వీఎఫ్‌ఎక్స్ మొదలుకుని సంగీతం.. సినిమాటోగ్రఫీ.. ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాలను కూడా సమన్వయ పర్చుకుంటూ ప్రతి ఒక్కరి నుండి కూడా బెస్ట్ రాబట్టాడు. టెక్నికల్ పరంగా సినిమా ఏ ఒక్క బాలీవుడ్ సినిమా కూడా పోటీ పడలేనంత అద్బుతంగా తెరకెక్కించాడు అనడంలో సందేహం లేదు. విజువల్స్ చూస్తుంటే ఒక తెలుగు సినిమానేనా ఇది అన్నట్లుగా అనిపించింది. నిర్మాణాత్మక విలువలు జక్కన్న సినిమా లో ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
విశ్లేషణ :
బాహుబలి తోనే రాజమౌళి స్థాయి హాలీవుడ్ కు చేరింది. కనుక ఈ సినిమా అంతకు మించి ఉంటుంది.. ఉంది అనుకోలేదు. ఆ స్థాయిలో ఉంటే చాలు అని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఆ స్థాయికి ఏమాత్రం తగ్గలేదు. బాహుబలిని చూసిన ప్రేక్షకులు ఈ సినిమా చూసిన తర్వాత పెదవి విరుపు ఉండదు. బాహుబలి వంటి సినిమాను తీసిన దర్శకుడు ఈ సినిమా ఎలా తీశాడు అనే చర్చ ఎక్కడ కూడా జరుగదు. బాహుబలి రేంజ్ సినిమా గా ఆర్ ఆర్ ఆర్ ని తెరకెక్కించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు హీరోలను ఒకే స్క్రీన్ పై జక్కన్న చూపించాలి అనుకున్నప్పుడే ఆయన ఒక వండర్ ను క్రియేట్ చేయబోతున్నట్లుగా అనిపించింది.
ఆ వండర్ ఇలా కలర్ ఫుల్ గా ఉండటంతో ప్రతి ఒక్కరికి కన్నుల పండుగ.. కన్నుల విందు అయ్యింది. ఒక పవర్ ఫుల్ కథను అంతకు మించిన పవర్ ఫుల్ సన్నివేశాలతో ఇద్దరు బిగ్గెస్ట్ హీరోలతో చూపించడంతో జక్కన్న సినిమా పై మరింత ఆసక్తి పెంచడం లో సక్సెస్ అయ్యాడు. సంగీతం.. సినిమాటోగ్రపీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను పెంచే విధంగా ఉన్నాయి. హాలీవుడ్ కు ఏమాత్రం తక్కువ కాకుండా తాను అనుకున్న విధంగా అద్బుతంగా సినిమా ని చూపించాడు.
ప్లస్ పాయింట్స్ :
ఇద్దరు హీరోల స్క్రీన్ ప్రజెన్స్,
రాజమౌళి టేకింగ్ మరియు స్క్రీన్ ప్లే,
సంగీతం,
సినిమాటోగ్రపీ,
వీఎఫ్‌ఎక్స్.
మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లుగా ఉన్నాయి,
ఆలియా పాత్ర ఇంకాస్త ఉంటే బాగుండేది.
రేటింగ్ : 4.0/5.0