...

Pushpa : కేక పుట్టించిన పుష్ప.. పుష్పరాజ్.. ఆ బాలీవుడ్ నటులు ఏమంటున్నారంటే..!

Pushpa : నువ్వొస్తానంటే మేమద్దంటామా అనేది మొన్నటి మాట.. నువ్వు రావాలి మమ్మల్ని ఉద్ధరించాలి అనేది ఇవాల్టి మాట.. అల్లు అర్జున్ కి రెడ్ కార్పెట్ పరుస్తోంది బాలీవుడ్ పరిశ్రమ. నార్త్ లో సెలబ్రిటీలు అందరూ వరుసపెట్టి బన్నీకి వీరతాళ్ళు వేస్తున్నారు. కొందరైతే అక్కడితోనే ఆగడం లేదు. హిందీ సినిమాకు పూర్వ వైభవం తీసుకువచ్చే బాధ్యతను కూడా పుష్ప రాజ్ మీదే పెట్టేస్తున్నారు. నమ్మశక్యంగా లేదు కదా కానీ, నిజం. నాట్ ఓన్లీ టాలీవుడ్ బట్ ఆల్ సో బాలీవుడ్.

Advertisement

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తాజా స్టేటస్ రిపోర్ట్ నార్త్ సైడ్ కూడా బలిష్టంగా మారుతోంది. పుష్ప వరల్డ్ వైడ్ గ్రాస్ 350 కోట్లను రీచ్ అవుతోంది. అందులో ఏకంగా 75 కోట్లు జస్ట్ హిందీలోనే వసూలైంది. ఈ బ్లాక్ బస్టర్ సౌండ్ ని మన కంటే ముందే పసిగట్టేసింది బీటోన్. ఇక్కడ నీకు వస్తున్న మాసీవ్ రెస్పాన్స్ చూస్తున్నా.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మరో బిగ్ హిట్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ పుష్ప రిలీజ్ అయిన నాలుగో రోజే ట్విట్ చేశారు అక్షయ్ కుమార్. మరో యంగ్ హీరో అర్జున్ కపూర్ అయితే ఇది సినిమా కాదు ఒక పొయెటిక్ మోషన్ పిక్చర్ అని అనేసారు.

Advertisement

Advertisement

జగ మొండి ఆటిట్యూడ్ ని కూల్ నెస్ ని ఒకే పాత్రలో చూపించిన బన్నీకి హ్యాట్సాఫ్ అని చెప్పారు. ది కూలెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు డాటరాఫ్ శ్రీదేవి జాన్వీ కపూర్. ఎందరో కాకలు తీరిన స్టార్స్ ని చూసిన బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ అయితే స్టార్ డమ్ అంటే ఐకాన్ స్టార్ దే అంటున్నారు. ఉత్తరాది క్రిటిక్ ప్రపంచం కూడా పుష్ప రాజ్ గా బన్నీ పర్ఫామెన్స్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఖాన్ దాదా లకంటే బిగ్గర్ స్టార్ అయ్యే లక్షణాలు ఐకాన్ స్టార్ లో పుష్కలంగా ఉన్నాయి. ఫ్యూచర్ లో మరిన్ని మంచి హిందీ సినిమాలను నీ నుంచి ఆశిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

కె ఆర్ కె. ఇలా అందరూ ఐకాన్ స్టార్లు ఒక ఆపద్బాంధవుడిని చూస్తున్నారు. మీలాంటి వాళ్ళు వచ్చి హిందీ ఇండస్ట్రీని కూడా సారవంతం చేయాలి అంటున్నారు. ఇవాళో,రేపో ఓటీటీ లో కూడా పుష్ప హిందీ వర్షన్ కి ఇంకెంత ఎప్లాజ్ వస్తుందో చూడాలి. ఈ మొత్తం సీక్వెన్స్ పుష్ప సెకండ్ చాప్టర్ మీద అంచనాలను పెంచేస్తున్నాయి. గతంలో బాహుబలి ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఎక్కువ వసూలు చేసింది. ఇప్పుడు పుష్ప నెక్స్ట్ పార్ట్ కూడా అదే యోగం పట్టబోతోందా అనేది వేచి చూడాలి.

Advertisement

Read Also : Pushpa Box Office Collections : హిందీలోనూ తగ్గేదేలే.. బాక్సాఫీస్ దగ్గర పుష్స కలెక్షన్ల సునామీ…! ఎన్ని కోట్లంటే?

Advertisement
Advertisement