Singer Chaiwala : ఈ టీ అమ్మేవాడు సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్.. ఇతడి టీ తాగి పాట కోసం జనాలు పిచ్చెక్కిపోతున్నారు..!

Singer Chaiwala : భోపాల్‌లోని బవేరియా కళా చౌరాహాలో ‘ది సింగర్ చాయ్ వాలా’ గోవింద్ బండిపై టీతో పాటు పాటలను పాడుతూ అలరిస్తున్నాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో బాగా ఫేమస్ అయ్యాడు.

Updated on: August 18, 2025

Singer Chaiwala : మీరు ఎంబీఏ చాయ్ వాలా, డోలీ చాయ్ వాలా గురించి వినే ఉంటారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త పేరు ‘ది సింగర్ చాయ్ వాలా’ అని చర్చ జరుగుతోంది. ఈ చాయ్ వాలా భోపాల్‌లోని బవారియా కళా చౌరాహాలో చిన్న బండిపై రుచికరమైన టీ అందిస్తాడు.

అంతేకాదు.. తన మధురమైన స్వరంతో కస్టమర్లను మంత్రముగ్ధులను చేస్తాడు. ఇప్పుడు ప్రజలు టీ తాగడానికే కాదు.. అతని పాటలు వినడానికి కూడా దూర ప్రాంతాల నుంచి వస్తారు. సోషల్ మీడియాలో వైరల్ ఈ చాయ్ వాలా వీడియో వైరల్ అవుతోంది.

‘ది సింగర్ చాయ్ వాలా’ గోవింద్ పగటిపూట ఒక ప్రైవేట్ రెస్టారెంట్‌లో పనిచేస్తాడు. సాయంత్రం పూట తన టీ షాపులో పాటలు పాడుతూ టీ అందిస్తాడు. టీ తాగుతూ అతని పాటలు వినేందుకు కస్టమర్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరూ వీడియోలు రికార్డు చేసి తమ సోషల్ అకౌంట్లలో పోస్టులు చేస్తున్నారు.

Advertisement

Singer Chaiwala : ఈ ఆలోచన ఎలా వచ్చింది? :

‘సింగర్ చాయ్ వాలా’ నడుపుతున్న గోవింద్.. ఈ ఆలోచన తన పార్టనర్ సోమేష్ సైనీకి వచ్చిందని చెప్పారు. గోవింద్ చిన్నప్పటి నుంచి పాడటం అంటే ఇష్టమని సోమేష్‌కు తెలుసు. అందుకే ఇద్దరూ కలిసి ఈ ప్రత్యేకమైన పేరును పెట్టారు. తద్వారా ప్రజలు టీ రుచితో పాటు సంగీతాన్ని కూడా ఆస్వాదించవచ్చు.

Read Also : Coloured Milestones : రోడ్డు మీద మైలురాళ్ళు వేర్వేరు రంగులలో ఎందుకు ఉంటాయి? 99 శాతం మందికి ఇది తెలియదు!

Singer Chaiwala : టీ కోసం వచ్చి పాట విని వెళ్ళిపోతున్న కస్టమర్లు :

“సోషల్ మీడియాలో మా వీడియో చూసిన తర్వాత ప్రజలు ఇక్కడికి వస్తారు. టీతో పాటు నా పాట విని ఆనందిస్తారు. చాలా మంది వీడియోలు తీసి నన్ను ‘సింగర్ చాయ్ వాలా’ అని గుర్తిస్తారు” అని గోవింద్ అంటున్నారు.

Advertisement

పగటిపూట ఉద్యోగం, సాయంత్రం టీ షాప్ :

గోవింద్ ఉదయం ఒక ప్రైవేట్ రెస్టారెంట్‌లో పనిచేస్తాడు. సాయంత్రం తన టీ స్టాల్‌ను నడుపుతాడు. ఎప్పుడూ తన పాటలను వదిలడు. చాలా చోట్ల తన పాటల ప్రతిభను ప్రదర్శించాడు, ప్రజల నుంచి అనేక ప్రశంసలు అందుకున్నాడు.

సోషల్ మీడియాలో దుమారం :
సింగర్ గోవింద్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అతను పాట పాడుతూ కస్టమర్లకు టీ అందిస్తున్నాడు. ఇప్పుడు ప్రజలు భోపాల్‌లోని బవారియా కళా చౌరాహాకు చేరుకుని బృందావన్ ధాబా ముందు అతని చిన్న బండి ఉన్న దుకాణం అడ్రస్ ఎక్కడా అని అడుగుతున్నారు.

సింగిర్ కావాలనే కల :
“ప్రజలు నన్ను ‘సింగర్ చాయ్ వాలా’ అని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం వస్తే నేను ఈ పాటల అభిరుచిని కొనసాగిస్తాను” అని గోవింద్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel