September 21, 2024

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన జీ 5… ఎన్ని కోట్లంటే?

1 min read
pjimage 67 1

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో డి.వి.వి.దానయ్య నిర్మాణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని మార్చి 25 వ తేదీ ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి చిత్రబృందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే ఒకసారి ప్రమోషనల్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించిన చిత్ర బృందం తాజాగా మరోసారి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.

pjimage 67 1సుమారు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఇక ఏ సినిమా అయినా థియేటర్ లో విడుదలైన తర్వాత ఆరు వారాలకు తప్పనిసరిగా ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా భారీ ఓటీటీ ధరలకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

అయితే కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఏకంగా 300 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా అన్ని సినిమాల మాదిరి ఆరు వారాలకు కాకుండా ఏకంగా 90 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, స్పానిష్‌ భాషలకు గాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు సమాచారం.