October 5, 2024

SIM Card: సిమ్ కార్డ్ కొనాలనుకునే వారికి షాక్… అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలు!

1 min read
pjimage 2022 03 04T165924.611

SIM Card: మొబైల్ వినియోగదారులకు టెలికాం సంస్థ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎవరైనా కేవలం ఆధార్ ప్రూఫ్ తో సిమ్ కార్డ్ కొనుగోలు చేసే అవకాశం ఉండేది.అయితే ఇకపై ఇలా కొనడానికి వీలులేకుండా టెలికాం సంస్థ కొన్ని నిబంధనలు అమలులోకి తీసుకువచ్చింది.ఈ నిబంధనల ప్రకారం సిమ్ కార్డు కొనుగోలు చేయడం కొందరికి ఎంతో సులభతరంగా మారిపోతే మరికొందరికి కష్టతరంగా మారిపోతుంది. కొత్త నిబంధన ప్రకారం ఫోన్ కొత్త కనెక్షన్ కోసం వినియోగదారులు ఇకపై స్టోర్ కి వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్ ద్వారా సిమ్ము కోసం దరఖాస్తు చేసుకుంటే నేరుగా సిమ్ మన ఇంటికి వస్తుంది.

pjimage 2022 03 04T165924.611ఇలా కొత్తగా కనెక్షన్ తీసుకొనే వారికి ఈ నిబంధన ఎంతో అనుకూలంగా ఉంది. ఇకపోతే గతంలో సిమ్ కార్డు కేవలం ఆధార్ ప్రూఫ్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చు అయితే ఇకపై ఒక్కటే కాదు సిమ్ కొనాలనుకుంటే 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే అర్హులని ఉత్తర్వులు జారీ చేశారు.18 సంవత్సరాలు పైబడినవారు ఆధార్ ద్వారా కొనుగోలు చేయాలని నిబంధనలను టెలికాం సంస్థ ప్రకటించింది.

ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే స్టోర్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా ప్రీపైడ్ ను పోస్ట్ పెయిడ్ గా మార్చుకోవడం కోసం కొత్త వన్ టైం పాస్ వర్డ్ ఆధారిత ప్రక్రియ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనుక ఇకపై సిమ్ కార్డు కొనాలంటే తప్పనిసరిగా 18 సంవత్సరాలు ఉండాలని టెలికాం సంస్థ ఈ సందర్భంగా తెలియజేశారు.