Guppedantha Manasu : మహేంద్ర చేసిన పనికి కోపంతో రగిలి పోతున్న రిషి..?

Updated on: March 2, 2022

Guppedantha Manasu Mar 2 Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏమేం జరిగిందో తెలుసుకుందాం.. సూచన షార్ట్ ఫిలిం లో భాగంగా ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ జగతిని అవమానించే విధంగా సంతానం గురించి మాట్లాడటంతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

guppedantha-manasu-mar-2-today-episode-rishi-get-very-angry-on-mahendra-today-guppedantha-manasu-serial
guppedantha-manasu-mar-2-today-episode-rishi-get-very-angry-on-mahendra-today-guppedantha-manasu-serial

జగతిని మహేంద్ర ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆగకుండా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడు జర్నలిస్ట్ మీకు మీ సంతానం పెళ్లికి ముందే పుట్టారా.. ఆ సంతానం కుంతీ పుత్రుడు అని జగతిని అవమానించే విధంగా మాట్లాడటంతో కోపంతో రగిలిపోయిన మహేంద్ర నీ భర్త గా చెబుతున్నాను ఆగు జగతి అని అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

అక్కడి నుంచి జగతిని స్టేజి పైకి పిలుచుకొని వచ్చి వచ్చిన మహేంద్ర, జగతి ఎవరో కాదు నేను తాళి కట్టిన నా భార్య అని అనడంతో దేవయాని షాక్ అవుతుంది. మరోవైపు రిషి కోపంతో రగిలి పోతూ ఉంటాడు. మహేంద్ర వారి సంతానం గురించి మాట్లాడుతూ మా ఇద్దరికీ సింహం లాంటి కొడుకు ఉన్నాడు వాడే రిషేంద్ర భూషణ్ అని చెప్పడంతో అక్కడ ఉన్న గౌతమ్, వసుధార, దేవయాని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు.

Advertisement

Guppedantha Manasu Mar 2 Today Episode : కోపంతో రగిలి పోతున్న రిషి..?

గా ఆ షార్ట్ ఫిలిం ప్రోగ్రాం చూడడానికి వచ్చిన మినిస్టర్ అంతా మనమంచికే, ఇప్పుడు మీ బంధం ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ జగతి, మహేంద్ర ని పొగుడుతూ ఉంటాడు. దానిని అవమానంగా భావించిన రిషి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. జగతి, రిషి ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. రిషి కనిపించకపోవడంతో వసుధార వెతుకుతూ ఉంటుంది.

ఇంతలో గౌతమ్, వసుధార దగ్గరకు వచ్చి ఈ విషయం నాకు ముందే తెలుసు కదా అని అడగగా, వసుధారా ఏం సమాధానం చెప్పకుండా రిషి సర్ కనిపించడం లేదు అని చెప్పగా అందుకు గౌతమ్ నువ్వు వెళ్లి వెతుకు నేను వెళ్ళి వెతుకుతాను అని చెబుతాడు. తమరు ఒకవైపు రిషి స్పీడ్ గా కార్ డ్రైవ్ చేస్తూ గ్రౌండ్ లో రౌండ్స్ తిప్పుతూ ఉంటాడు. ఇంతలో వసుధార వచ్చి కారు కి అడ్డంగా నిలబడుతుంది.

జరిగిన ఈ విషయాన్ని మాట్లాడుతూ రిషి కోప్పడగా, వసుధారా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ రిషి మాత్రం తన తల్లి జగతిని స్వార్థపరులు, అవకాశవాది అని తిడుతూ ఉంటాడు. మరొకవైపు మహేంద్ర జగతిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మహేంద్ర గడపదాటి లోపలికి వస్తూ ఉంటే, అప్పుడు జగతిలోపల కి రావద్దు అని అంటుంది.

Advertisement

రిషి ని బాధ పెట్టకూడదు ఇన్ని రోజులు ఇలా ఉన్నాం కానీ నువ్వు ఈ రోజు రిషి మనసును బాధ పెట్టే విధంగా మాట్లాడావు అని మహేంద్ర ని తప్పు పడుతుంది జగతి. మరొక వైపు రిషి, జగతి ని తిడుతూ ఉంటే వసుధార నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Janaki kalaganaledu: అడ్డంగా దొరికిపోయిన జానకి.. బాంబు పేల్చడానికి సిద్ధమైన మల్లిక..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel