...

Jabardasth Varsha: వర్ష అసలు అమ్మాయేనా? అంటూ వర్ష పరువు తీసిన ఇమ్మాన్యుయేల్ తల్లి…!

Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రష్మి సుదీర్ తర్వాత అంత క్రేజ్ ఉన్న జంట వర్ష, ఇమ్మాన్యుయేల్ జంట అని చెప్పవచ్చు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వీరు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్కిట్ చేయడం వల్ల వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా
ఇమ్మాన్యుయేల్ తల్లి వర్షను దారుణంగా అవమానించి తన పరువు మొత్తం తీసింది.

Advertisement

బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ తమ కుటుంబ సభ్యులను వేదికపైకి తీసుకువచ్చారు ఈ క్రమంలోనే ఇమ్మాన్యుయేల్ తన తల్లిని వేదికపైకి తీసుకువచ్చి తమదైన శైలిలో కామెడీ చేశారు. ఈ క్రమంలోనే ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ ఏంటి అమ్మ ఊర్లో అంతా ఏమనుకుంటున్నారు అని అడగగా వెంటనే తన తల్లి కోడలిని ఎప్పుడు తీసుకువస్తావు అంటూ అడుగుతున్నారు రా అని సమాధానం చెబుతుంది. మరి నువ్వేం చెప్పావని ఇమ్మాన్యుయేల్ అడుగుతాడు.

Advertisement

ఈ ప్రశ్నకు ఇమ్మాన్యుయేల్ తల్లి మాట్లాడుతూ నువ్వే క్లారిటీ ఇవ్వాలి అని చెప్పగా ఏ విషయంలో అంటూ ఇమ్మాన్యుయేల్ అడగడంతో వర్ష అసలు అమ్మాయేనా కాదా క్లారిటీ ఇవ్వాలి అని తన తల్లి అందరి ముందు వర్ష పరువు తీసింది. ఇలా ఒక్కసారిగా వర్ష పై పంచ్ వేయడంతో అక్కడున్న వారందరూ ఎంతో సరదాగా నవ్వుకున్నారు.వ్ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Advertisement