Singer Parvathi : ఆ ఊరికి బస్సు రావడానికి స్మితా, నేనే కారణం.. ఆ మంత్రుల సాయం మరువలేనిది

Singer Parvathi : ఆమెది ఓ మారుమూల పల్లెటూరు. సరిగా రవాణా వ్యవస్థ కూడా లేని ప్రాంతం. ఎక్కడో ఓ మారుమూల విసిరేసినట్లుగా ఉంటుంది ఆమె ఊరు. ఊరికి ఎన్నో ఏళ్ల నుంచి బస్సు లేదు. రాలేదు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఊరి ప్రజలు కూడా సాలించుకున్నారు. అయితే ఒక్క సారిగా వాళ్ల ఊరికి బస్సు ఆగమేఘాల మీద వచ్చింది. కారణం ఆ అమ్మాయినే. తాను పాడిన ఓ పాటతో ఎంతో మంది అభిమానులు సంపాధించుకున్న పార్వతి అనే సింగర్​ కారణంగానే ఆ ఊరికి బస్సు వచ్చింది.

ఇంతకీ ఏం జరిగింది అంటే.. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన దాసరి పార్వతి అనే అమ్మాయి జీ తెలుగులో టెలికాస్ట్​ అవుతున్న ఓ పాటల కార్యక్రమంలో ఓ పాట పడింది. దానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న మ్యూజిక్​ డైరెక్టర్​ కోటీ, సింగర్​ స్మితా, అనంత శ్రీరామ్, సుశీలమ్మలు ఆ అమ్మాయి పాడిన పాటకు ఫిదా అయ్యారు. అయితే అదే సమయంలో సంగీత దర్శకుడు కోటి గారు ఆమ్మాయిని ఏం కావాలో కోరుకో అని ఓ వరం ఇచ్చినట్లు అడిగారు… అందుకు ఆ అమ్మాయి తనకు ఏం వద్దని మా ఊరికి బస్సు లేదని, వేయించాలని కోరింది. అయితే ఆమె అడినట్లుగానే ఆ ఊరికి బస్సు వచ్చింది. అయితే దీని వెనుక కేవలం కోటిగారూ మాత్రమే లేరు అని చెప్పారు.

బస్సు ఆ వూరికి తిరగాలి అంటే కావాల్సిన అన్నీ పనులను చకచక చేయించిన ఘనత ఏపీలోని ఇద్దరు మంత్రులకు దక్కుతుందని అన్నారు. వారిలో ఒకరు బొత్స సత్యనారాయణ కాగా.. మరోకరు పేర్ని నాని. అయితే ఈ ఇద్దరు పట్టుబట్టడం వల్లే అన్నీ చకచక జరిగిపోయినట్లు కోటీ పేర్కొన్నారు. తనకు ఎవరు అయినా పాడిన పాట నచ్చితే కచ్చితంగా ఏం కావాలని అడుగుతాను అని అలానే పార్వతీని కూడా అడిగినట్లు చెప్పుకొచ్చారు. అయితే పార్వతీ కోరిన కోరికక స్టన్ అయినట్లు చెప్పుకొచ్చారు. తన పాటో సింగర్ స్మితా కూడా బస్ పై పట్టుబట్టి రంగంలోకి దిగినట్లు చెప్పుకొచ్చారు. తాను బొత్సా సత్యనారాయణతో మాట్లాడితే, సింగర్ స్మితా కూడా మంత్రి పేర్ని నానీతో చర్చించి ఆఖరకు బస్సు వచ్చేలా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఇద్దరు మంత్రులు లేకపోతే తాము ఇచ్చిన మాట నిరవేరేది కాదేమో అని చెప్పుకొచ్చారు కోటీ.

Advertisement

Read Also : Karthika Deepam Feb 26 Episode : ఇంటికొచ్చిన మోనితాపై వంటలక్క ఫైర్.. అసలు నిజం తెలిసి ఏమి చేసిందంటే?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel