Oscar Awards : ఆస్కార్ నామినేషన్స్ లో భారత డాక్యుమెంటరీ ఫిల్మ్..!

Oscar Awards : సినీ పరిశ్రమకి అతి పెద్ద అవార్డు ఏదైనా ఉంది అంటే అది ” ఆస్కార్ ” మాత్రమే. ఎంతో మంది సినిమా వాళ్లకి ఆస్కార్ ఒక కల. తాజగా 94వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌ మంగళవారం ఫిబ్రవరి 8న వెల్లడయ్యాయి. ట్రెసీ ఎల్లిస్‌ రాస్, లెస్లీ జోర్డాన్‌ ఆస్కార్‌ నామినేషన్స్‌ ప్రకటనకు యాంకర్స్ గా వ్యవహరించారు. ఆస్కార్ నామినేషన్స్ అన్ని విభాగాలలోనూ నామినేట్ అయిన సినిమాలని, సినిమా వ్యక్తులని వెల్లడించారు.

ఈ సారి నామినేషన్స్ లో ఇండియా నుంచి ఒకే ఒక్క డాక్యుమెంటరీ సినిమా చోటు దక్కించుకుంది. మన దేశం నుంచి ఢిల్లీకి చెందిన ఫిల్మ్‌మేకర్స్‌ రిటు థామస్, సుస్మిత్‌ ఘోష్‌ తీసిన ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ అనే సినిమా ఆస్కార్‌ నామినేషన్‌ను దక్కించుకుంది. ఈ సినిమా బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఇప్పటికే పదిహేనుకు పైగా వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించింది. దీంతో ఈ డాక్యుమెంటరీ ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు.

Writing With Fire 1

ఆస్కార్ నామినేషన్స్ లో ఈ సారి ‘ద పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’ సినిమా ఏకంగా 12 నామినేషన్లలో చోటు దక్కించుకుంది. ‘డ్యూన్‌’ సినిమా 10, ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీ’, ‘బెల్‌ఫాస్ట్‌’ సినిమాలు 7 కేటగిరీలలో నామినేషన్లు దక్కించుకున్నాయి. ఈ సారి ఉత్తమ చిత్రం అవార్డు కోసం ఏకంగా పది సినిమాలు పోటీ పడుతున్నాయి. 94వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం మార్చి 27న జరగనుంది. ఏ సినిమాకి ఏ అవార్డు వచ్చిందో తెలుసుకోవాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే.

Tufan9 Telugu News And Updates Breaking News All over World