RRR Movie Release Date : ఒమిక్రాన్ ప్రభావం, సినిమా టికెట్ ఇష్యూ కారణంగా టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ కావల్సిన భారీ సినిమాలన్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో పలు చిత్ర యూనిట్లు సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాయి. అలానే పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు ఎత్తి వేస్తుండడంతో మూవీ విడుదలకు నిర్మాతలు ఒకే అంటున్నారు. ఈ తరుణంలో మళ్ళీ టాలీవుడ్ లో సినిమాల జోరు మొదలవుతుంది. ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా యావత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ ” ఆర్‌ఆర్‌ఆర్ ” సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి బడా స్టార్‌లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. రాజమౌళి డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్ గన్, శ్రియ, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆర్‌ఆర్‌ఆర్‌కు బ్రేక్ పడుతూ వస్తోంది. జనవరిలో చిత్ర విడుదల కన్ఫామ్ అనుకుంటున్న సమయం లోనే కరోనా థర్డ్ వేవ్ రూపంలో మరోసారి బ్రేక్ పడింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరగడంతో చిత్ర యూనిట్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
#RRRonMarch25th, 2022… FINALISED! 🔥🌊 #RRRMovie pic.twitter.com/hQfrB9jrjS
Advertisement— RRR Movie (@RRRMovie) January 31, 2022
Advertisement
అయితే తర్వాత కొన్ని రోజులకు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ తాజాగా ఈ రెండు రోజులు కాకుండా సినిమాను మార్చి 25 న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగా, నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ సినిమాతో పాటు ఆచార్య, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, ఎఫ్ 3 చిత్రాల రిలీజ్ డేట్ లను కూడా ప్రకటించారు.
Read Also : Radhe Shyam Movie Release : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Tufan9 Telugu News And Updates Breaking News All over World