Pushpa Srivalli Dance : పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే… ఈ డైలాగ్ ఎంత పాపులరో.. అలాగే శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్ కూడా అంతే పాపులర్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ (Pushpa The Rise) మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుంది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఓటీటీలో కూడా రికార్డుల మోత మోగిస్తోంది. పుష్ప మూవీలో ప్రతి పాట, డైలాగ్ సూపర్ హిట్ అయ్యాయి.
అందులో శ్రీవల్లి సాంగ్ క్రేజ్ మాములుగా లేదు.. పుష్ప డైలాగులతో స్టార్ క్రికెటర్లంతా ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా శ్రీవల్లి పాటకు సిగ్నేచర్ స్టెప్ వేశాడు. అది కూడా తన నానమ్మతో కలిసి ఇరగదీశాడు. ఇద్దరూ కలిసి తగ్గేదేలే అంటూ బన్నీ స్టయిల్ ఇమిటేట్ చేశారు. మా పుష్ప నానమ్మ అంటూ పాండ్యా వీడియోను తన సోషల్ అకౌంట్లో పోస్టు చేశాడు.
ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది. కళ్లకు గ్లాసు పెట్టుకుని మనవడితో కలిసి శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పులేసిన బామ్మను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 20.37 లక్షల మంది వీక్షించారు. మీరు కూడా ఓసారి చూసేయండి.. బామ్మ శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్…
AdvertisementView this post on Instagram
A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)
Advertisement
Read Also : Republic Amla Plant : ఈ రిపబ్లిక్ డే స్పెషల్ ఇన్విటేషన్ కార్డు.. నాటితే మొక్క పుట్టుకొస్తుంది… ఇదిగో..!